సైరా సూరి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడా..? ఇంత‌కీ ఏంటా బిజినెస్..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 1:23 PM GMT
సైరా సూరి బిజినెస్ ప్లాన్ చేస్తున్నాడా..? ఇంత‌కీ ఏంటా బిజినెస్..?

హీరోలు, నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు ఓ వైపు సినిమాలు చేస్తూనే... మ‌రో వైపు వ్యాపార రంగంలో ప్ర‌వేశించ‌డం చూస్తునే ఉన్నాం. నాగార్జున‌, చిరంజీవి.. సినిమాల్లో న‌టిస్తూనే.. టెలివిజ‌న్, రియ‌ల్ ఎస్టేట్, స్పోర్ట్స్ త‌దిత‌ర వ్యాపార‌ల్లో ఎంట‌ర్ అవ్వ‌డం తెలిసిందే. తాజాగా మ‌హేష్ బాబు కూడా బిజినెస్ మేన్ గా ఫుల్ బిజీ అయ్యారు. యువ హీరోలు నితిన్, సందీప్ కిష‌న్, శ‌శాంక్, కోన వెంక‌ట్, త‌రుణ్ త‌దిరులు హోట‌ళ్లు, ప‌బ్బుల బిజినెస్ చేస్తున్నారు.

తాజాగా సైరా సినిమాతో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి కూడా బిజినెస్ చేయాల‌నుకుంటున్నార‌ట‌. సైరా సినిమాకి ఇచ్చిన రెమ్యూన‌రేష‌న్‌ని సురేంద‌ర్ రెడ్డి వివిధ వ్యాపార‌ల్లో పెట్టుబ‌డి పెట్టార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. సురేంద‌ర్ రెడ్డి భార్య జూబ్లీ హిల్స్ లోని ఓ ప్రముఖ హోట‌ల్లో వాటా తీసుకుని గ‌చ్చిబౌలి ఏరియాలోని త‌న ప్రాంచైజీని ప్రారంభించార‌ని టాక్ వినిపిస్తోంది. అలాగే మ‌రో రెండు హోట‌ళ్ల‌ను ఏర్పాటు చేయ‌డానికి సురేంద‌ర్ రెడ్డి ప్లాన్ చేస్తున్నార‌ట‌. టాలీవుడ్ లో ప్ర‌ముఖులు ఇలా వ్యాపార రంగంలో ప్ర‌వేశించ‌డం కొత్త కాదు. అయితే.. ఈ రంగంలో స‌క్స‌స్ అవ్వాలంటే.. ఎంతో క‌ష్ట‌ప‌డాలి. దానికి చాలా టైమ్ ప‌డుతుంది. మ‌రి.. సురేంద‌ర్ రెడ్డి సినిమా రంగంలో స‌క్స‌స్ అయ్యాడు.. వ్యాపార రంగంలో కూడా స‌క్స‌స్ అవుతాడ‌ని ఆశిద్దాం.

Next Story
Share it