సైరా.. రెండు పాట‌ల‌ను క‌ల‌ప‌నున్నారా..? ఎప్పుడు క‌లుపుతారు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  3 Oct 2019 6:47 PM IST
సైరా.. రెండు పాట‌ల‌ను క‌ల‌ప‌నున్నారా..? ఎప్పుడు క‌లుపుతారు..?

హైదరాబాద్‌ : మెగాస్టార్ చిరంజీవి 'సైరా నరసింహారెడ్డి 'దాదాపు 5,000 థియేట‌ర్స్ లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలై పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఫ‌స్టాఫ్ అక్క‌డ‌క్క‌డా స్లోగా ఉంద‌నిపించినా... సెకండాఫ్ స్టార్ట్ అయిన‌ప్ప‌టి నుంచి రోమాంచిత సన్నివేశాలు అదరగొట్టాయి. అద్భుతంగా వచ్చిన ఇంటర్వల్ బ్లాక్, పతాక సన్నివేశంలో చిరంజీవి అద్భుత నటన సినిమాని నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళాయని పబ్లిక్ టాక్ .

ఇక అస‌లు విష‌యానికి వ‌స్తే... ఈ సినిమాలోని పాటల విషయంలో చిరంజీవి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. ప్రస్తుతానికి కేవలం రెండు పాటలు మాత్రమే ఉన్నాయి. అయితే సినిమా విడుదలకు ముందు రోజు చిరంజీవి ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ... మొత్తంగా నాలుగు పాటలను ఈ సినిమా కోసం తీశామన్నారు. అయితే..కథా గమనానికి అడ్డు పడకుండా ఉండటం కోసం సినిమాలో రెండు పాటలే ఉంచినట్లు చెప్పారు.

ఒకవేళ అన్నీ అనుకున్నట్లుగా జరిగితే మిగిలిన ఆ రెండు పాటలను కూడా వీలును బట్టి సినిమాలో కలుపుతామని చిరంజీవి చెప్పారు. అయితే ఇప్పుడు సినిమా పెద్ద హిట్ కావడంతో, కొద్ది రోజుల తర్వాత పాటలు కలిపే అవకాశముంది. అయితే..ఎప్పుడు కలుపుతారో చూడాలి.

Next Story