స్విగ్గీలో 3లక్షల ఉద్యోగాలు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 5:49 PM GMT
స్విగ్గీలో 3లక్షల ఉద్యోగాలు..!

స్విగ్గీ అంటే తెలియని వారు ఉండరు . ముఖ్యంగా పట్టణాల్లో. అయితే..నిరుద్యోగులకు అవకాశాల గనిగా కనిపిస్తోంది స్విగ్గీ. ప్రముఖ ఫుడ్ డెలివరీ సంస్థ అయిన స్వీగ్గీ భారీ ప్రణాళికలు సిద్ధం చేసుకుంటుంది. ప్రత్యర్ధులకు అందనంతగా ఎదగాలని స్కెచ్‌లు వేస్తుంది. రానున్న రెండేళ్లలో 3లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించింది. అంతేకాదు..భవిష్యత్తులో 5 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని సంకల్పించింది. స్విగ్గీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో శ్రీహర్ష మెజుటీ ఈ విషయం చెప్పారు.రాబోయే 10-15 ఏళ్ల ప్రణాళికలను కూడా స్విగ్గీ సిద్ధం చేసుకుంటుంది. 100 మిలియన్ల కస్టమర్లు తెచ్చుకుంటామని నమ్మకంగా చెబుతున్నారు. దేశంలో అతిపెద్ద మూడో సంస్థగా ఆవిర్భవించాలనే ప్రణాళికలతో స్విగ్గీ ముందుకు వెళ్తుంది.

Next Story