సిక్కు ఆలయంపై ఉగ్రదాది.. 27 మంది మృతి
By అంజి Published on 25 March 2020 3:32 PM ISTముఖ్యాంశాలు
- కాబూల్‌లో ఆత్మహుతి దాడి, 27 మంది మృతి
- గురుద్వారాలోకి ప్రవేశించిన ఉగ్రవాదులు
- భద్రతా బలగాలు.. ఉగ్రవాదులకు మధ్య కాల్పులు
అప్ఘానిస్తాన్ రాజధాని కాబూల్ నడిబొడ్డున బుధవారం ఆత్మహుతి దాడి జరిగింది. ఈ ఘటనలో 27 మంది మృతి చెందారు. చాలా మందికి గాయాలు అయ్యాయి. సాయుధ ముష్కరులు, ఆత్మాహుతి దళాలు ఈ దాడికి పాల్పడ్డాయి. అయితే దేశంలో మైనారిటీ సమాజంపై జరిగిన ఘోరమైన దాడుల్లో ఇది ఒకటి అని స్థానిక మీడియా పేర్కొంది. షోర్ బజార్ ప్రాంతంలోని గురుద్వారాలో ముష్కరులు సుమారు 07:45 గంటలకు దాడి చేశారు. అక్కడే ఉన్న భద్రతా సిబ్బందిపై కాల్పులు జరిపి మరీ 11 మందిని చంపేశారు. ఈ ఘటనపై ఆ దేశ హోంమంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి తారిక్ ఏరియన్ మాట్లాడారు. ధరమ్‌శాలలో ఆత్మహుతి దళాలు దాడులకు పాల్పడ్డాయన్నారు. ఆ ప్రదేశంలో భద్రతను మరింత కట్టుదిట్టం చేశామని పేర్కొన్నారు. గాయపడ్డ వారిని స్థానిక ఆస్పత్రికి తరలించినట్లు వివరించారు.
Also Read: బుద్దిలేదా..? ఆ కరోనాకు నీవు మొనగాడివని తెలుసా..?
అయితే ఆప్ఘాన్‌లో జరిగిన ఆత్మహుతి దాడిలో తమకు ఎటువంటి సంబంధం లేదని తాలిబన్ సంస్థ ప్రకటించింది. గురుద్వార నుండి కనీసం 11 మంది పిల్లలను రక్షించినట్లు కాబూల్ పోలీసులు తెలిపారు. దాడికి జరిగినప్పుడు డు 150 మంది వరకు ప్రార్థన చేస్తున్నారని సిక్కు శాసనసభ్యుడు నార్దేందర్ సింగ్ ఖలీసా ఘటన స్థలం వద్ద మీడియా ప్రతినిధులతో అన్నారు. ఈ దాడికి పాల్పడింది తామేనని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ సంస్థ ప్రకటన చేసింది. గురుద్వారపై జరిగిన దాడిని భారత గృహ, పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ ఖండించారు. నలుగురు ఉగ్రవాదులను అప్ఘాన్ బలగాలు హతమార్చాయి.
Also Read: పోతావురరేయ్.. పోతావ్ అంటున్న సుమక్క