సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇంత వరకూ టైటిల్ ఖరారవ్వలేదు. చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్క అప్ డేట్ కూడా లేదు. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చిత్తూరు యాసలో ఉంది. ” ఏమబ్బా అందరూ బాగుండారా. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే #AA20 అప్ డేట్, ఏప్రిల్ 8న తెల్లార్తే 9 గంటలకు వస్తాండాది..రెడీ కాండబ్బా ” అని ట్వీట్ లో రాసి ఉంది.

చిత్ర యూనిట్ నుంచి ఈ ట్వీట్ రాగానే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ సర్ ప్రైజ్ రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. కాగా..చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. రష్మిక మండన్న కథానాయికగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాక సినిమాలో బన్నీ లుక్, స్టైల్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుందట.

రాణి యార్లగడ్డ

నాపేరు యార్లగడ్డ నాగరాణి. నేను న్యూస్ మీటర్ తెలుగులో జర్నలిస్ట్ గా పనిచేస్తున్నాను. గతంలో నేను ఆంధ్రప్రభ, సీవీఆర్ న్యూస్ ఛానెల్ లో మూడున్నరేళ్లు పనిచేశాను. జర్నలిజం పట్ల నాకు ఉన్న ఇష్టం, ఆసక్తితో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.