అల్లు అర్జున్ బర్త్ డే గిఫ్ట్ వస్తాండాది..రెడీ కాండబ్బా..
By రాణి
సుకుమార్ దర్శకత్వంలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రానికి ఇంత వరకూ టైటిల్ ఖరారవ్వలేదు. చిత్రం షూటింగ్ మొదలైనప్పటి నుంచి ఒక్క అప్ డేట్ కూడా లేదు. ఏప్రిల్ 8వ తేదీన అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా చిత్ర బృందం ఫ్యాన్స్ కు సర్ ప్రైజ్ ఇవ్వనుంది. ఈ మేరకు చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్ చిత్తూరు యాసలో ఉంది. '' ఏమబ్బా అందరూ బాగుండారా. మీరు ఎప్పుడెప్పుడా అని చూస్తాండే #AA20 అప్ డేట్, ఏప్రిల్ 8న తెల్లార్తే 9 గంటలకు వస్తాండాది..రెడీ కాండబ్బా '' అని ట్వీట్ లో రాసి ఉంది.
చిత్ర యూనిట్ నుంచి ఈ ట్వీట్ రాగానే ఫ్యాన్స్ ఎప్పుడెప్పుడు ఆ సర్ ప్రైజ్ రిలీజ్ చేస్తారా అని ఎదురుచూస్తున్నారు. కాగా..చిత్తూరు జిల్లాలో ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో చిత్రం రూపొందుతున్నట్లు సమాచారం. రష్మిక మండన్న కథానాయికగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శేషాచలం అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారు. ఈ సినిమాలో బన్నీ రెండు విభిన్న పాత్రల్లో నటించనున్నట్లు వార్తలొచ్చాయి. అంతేకాక సినిమాలో బన్నీ లుక్, స్టైల్ కూడా కాస్త డిఫరెంట్ గా ఉంటుందట.