చెన్నై జట్టుతో సురేష్‌ రైనా గొడవ..! ఇక పై చెన్నైకి ఆడడా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  1 Sept 2020 6:56 AM IST
చెన్నై జట్టుతో సురేష్‌ రైనా గొడవ..! ఇక పై చెన్నైకి ఆడడా..?

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌(ఐపీఎల్) ప్రారంభమైనప్పటి నుంచి ఒక్క మ్యాచ్‌ కూడా మిస్‌ కానీ ఆటగాడు సురేష్‌ రైనా. చెన్నై సూపర్‌ కింగ్స్‌ సాధించిన విజయాల్లో రైనా కీలక పాత్ర పోషించాడు. కాగా.. ఈ సీజన్‌ నుంచి రైనా అర్థాంతరంగా తప్పుకున్న విషయం తెలిసిందే. చెన్నై జట్టుతో పాటు దుబాయ్‌ వెళ్లిన రైనా.. వారం రోజులు తిరగకముందే స్వదేశానికి వచ్చేశాడు. మొదట అందరూ షాక్‌ గురైయ్యారు. అయితే.. రైనా వ్యక్తిగత కారణాలతోనే స్వదేశానికి వచ్చినట్లు జట్టు యాజమాన్యం తెలిపింది. అయితే.. అది ఏంటి అనేది మాత్రం వెల్లడించలేదు. సన్నిహితుల మరణం కారణంగా రైనా వచ్చినట్లు నిన్నటి వరకు వార్తలు రాగా.. తాజాగా మరో కథనం బయటికి వచ్చింది. దుబాయ్‌లో రైనాకు కేటాయించిన గది నచ్చకపోవడంతో అసంతృప్తితో వెళ్లిపోయాడని ఓ జాతీయ మీడియా కథనాన్ని వెల్లడించింది.

20 ఓవర్లలో 92 పరుగులను కాపాడుకున్న డారెన్ సామీ టీమ్..!

దుబాయ్ వెళ్లిన చెన్నై సూపర్‌ కింగ్స్ ఆటగాళ్లు బీసీసీఐ రూల్స్ ప్రకారం 6 రోజుల ఐసోలేషన్‌లోకి వెళ్లిపోయారు. దుబాయ్‌లో తనకు కేటాయించిన గది.. రైనాకు మొదటి రోజే నచ్చలేదు. కనీసం ఆ గదికి సరైన బాల్కనీ కూడా లేదని రైనా అసంతృప్తి వ్యక్తం చేశాడట. కెప్టెన్ ఎంఎస్ ధోనీకి ఇచ్చిన తరహా గది తనకు కావాలంటూ కోరాడట. అయితే ప్రాంచైజీ నుండి స్పందన రాకపోవడంతో.. చివరకు ధోనీకే విషయం చెప్పాడు. ఈ విషయంలో తానేమీ చేయలేనన్న ధోనీ.. రైనా ఆగ్రహాన్ని చల్లార్చే ప్రయత్నం చేయలేదు. దాంతో మహీపై కూడా అసహనం కనబరుస్తూ.. రైనా వ్యక్తిగత కారణాలు అంటూ స్వదేశం వచ్చాడట ఆ కథనంలో పేర్కొంది.

కీరన్‌ పొలార్డ్‌ విధ్వంసం.. ఆశలు లేని స్థితిలోంచి గెలిచిన నైట్ రైడర్స్

ఈ ఘటనపై ఆ జట్టు యజమాని శ్రీనివాసన్‌ కూడా స్పందించారని చెప్పింది. 'ప్రస్తుతం పరిస్థితులపై ధోనితో మాట్లాడాను. ఒకవేళ ఇంకా ఎవరైనా ఆటగాళ్లు వెళ్లిపోయినా కంగారు పడాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చాడు. అందరి ఆటగాళ్లతో అతడు జూమ్‌లో మాట్లాడి క్షేమంగా ఉండాలని చెప్పాడు. అయితే.. ఎవరు ఎలా ఉంటారో ఎవరికీ తెలియదు. నేనేమనుకుంటానంటే.. ఇష్టం లేకపోతే.. ఎవరైనా తిరిగి వెళ్లిపోవచ్చు. ఎవర్నీ బలవంతంగా ఏదీ చేయమని అడగను. కొన్నిసార్లు విజయాలు నెత్తికెక్కుతాయి. నాకైతే.. అద్భుతమైన కెప్టెన్‌ దొరికాడు. దేనీకి భయపడదు. ఇలాంటి పరిస్థితుల్లో జట్టులోని అందరి ఆటగాళ్లతో మాట్లాడి వారికి నమ్మకం కలిగిస్తున్నాడు' అని శ్రీనివాస్‌ పేర్కొన్నారు.

రైనా కుటుంబంలో అంత ఘోరం జరిగిందా?

జట్టులో ప్రతిభకు కొదవ లేదు. సురేష్ రైనా స్థానంలో సత్తా చాటేందుకు రుతురాజ్‌కు ఇది మంచి అవకాశం. అయినా ఇంకా ఐపీఎల్‌ మొదలే కాలేదు. భారీ డబ్బు (రూ. 11 కోట్లు)తో సహా తాను ఏం కోల్పోయాడో రైనా తర్వాత తెలుసుకుంటాడు' అని శ్రీనివాసన్‌ మండిపడ్డారు. రైనా మళ్లీ తిరిగి వచ్చే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశాడు. కాగా.. ఐపీఎల్‌ ప్రారంభం నుంచి చెన్నై తరఫున ఆడుతున్న సురేష్ రైనా.. కేవలం హోటల్ గది గురించి తప్పుకోడని.. ప్రాంచైజీతో ఇంకా పెద్ద గొడవే జరిగినట్టు పలువురు సందేహం వ్యక్తం చేస్తున్నారు. ఇకపై రైనా చెన్నైకి ఆడకపోవచ్చునని ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉంటే.. చెన్నై జట్టులో ఇద్దరు ఆటగాళ్లు సహా పది మంది సహాయక సిబ్బంది కరోనా బారీన పడిన సంగతి తెలిసిందే.. వీరికి నిర్వహించే పరీక్షల్లో నెగిటివ్‌ వస్తేనే బయోబడుగలోకి అనుమతిస్తారు.

ఆదిలోనే ఢిల్లీ క్యాపిటల్స్ కు షాక్..!

Next Story