కూతురితో గ‌ల్లి క్రికెట్ ఆడిన భార‌త‌ క్రికెట‌ర్

By తోట‌ వంశీ కుమార్‌  Published on  7 April 2020 1:47 PM GMT
కూతురితో గ‌ల్లి క్రికెట్ ఆడిన భార‌త‌ క్రికెట‌ర్

క‌రోనా వైర‌స్ ప్ర‌పంచాన్ని భ‌య‌పెడుతోంది. ఈ మ‌హ‌మ్మారి ముప్పుతో క్రికెట్ కార్య‌క‌లాపాలు అన్ని వాయిదా ప‌డిన సంగ‌తి తెలిసిందే. దీంతో క్రికెట‌ర్లు ఇంటికే ప‌రిమితం అయ్యారు. టీమిండియా క్రికెట‌ర్ సురేష్ రైనా త‌న కూతురితో క‌లిసి క్రికెట్ ఆడుతున్న వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌స్ అవుతుంది. ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో సురేష్ రైనా చెన్నై సూప‌ర్ కింగ్స్‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నాడు. తాజాగా చెన్నై సూపర్ కింగ్స్ అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ లో ఈ వీడియోను పోస్ట్ చేసింది. రైనా ఇంటిలో గల్లీ క్రికెట్ ఆడుతున్న దృశ్యాలు ఆసక్తికరంగా ఉన్నాయి అని కామెంట్ చేసింది. విజిల్ పోడు అనే హ్యాష్‌ట్యాగ్‌ను జోడించింది.

ఈ వీడియోలో రైనా.. త‌న కుమారైతో పాటు మ‌రో చిన్నారితో క‌లిసి క్రికెట్ ఆడాడు. ఒకసారి రైనా బౌలింగ్ చేయగా, మరోసారి బ్యాటింగ్ చేశాడు. అతని కూతురు గార్సియా అంపైర్‌గా విధులు నిర్వహించింది. కాగా ఈ వీడియో నిడివి 19 సెకన్లు.

గ‌త కొంత కాలంగా టీమ్ఇండియాకు దూరంగా ఉంటున్న‌ ఈ యూపీ క్రికెట‌ర్ ఐపీఎల్ మాత్రం ఆడుతున్నాడు. మార్చి 29 నుంచి ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ -13వ సీజ‌న్ క‌రోనా ముప్పుతో ఏప్రిల్ 15 కు వాయిదా వేశారు. ప్ర‌స్తుతం క‌రోనా పాజిటివ్‌ల సంఖ్య రోజు రోజుకు పెరుగుతుండ‌డంతో 15 నుంచి ఐపీఎల్ జ‌ర‌గ‌డం అనుమానంగా మారింది.Next Story
Share it