సూపర్ స్టార్ రజినీకాంత్ తను పుట్టిన నక్షత్రం, తిధి ప్రకారం సోమవారం నాడు పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ సందర్భంగా చెన్నై లోని తన నివాసంలో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళకు చెందిన తన వీరాభిమాని అని ప్రత్యేకంగా పిలిపించుకుని మరీ కలుసుకున్నారు. ప్రత్యేక ప్రతిభావంతుడైన ప్రణవ్ కు చేతులు లేకపోవటంతో అతని కాలికి షేక్ హ్యాండ్ ఇచ్చారు. కాసేపు ముచ్చటించారు. ఇప్పుడు ఈ చిత్రాలు వైరల్ అవుతున్నాయి. రాఘవ లారెన్స్ తో సహా పలువురు ప్రముఖులు సైతం ఈ చిత్రాలను ట్వీట్ చేస్తున్నారు. తేదీల ప్రకారం ఈనెల 12వ తేదీన రజనీకాంత్ పుట్టినరోజు కావడంతో ఆ వేడుకల కోసం అభిమాన సంఘాలు భారీ ఏర్పాట్లు చేస్తున్నాయి.

న్యూస్‌మీటర్ నెట్‌వర్క్

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్.. మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను అందిస్తుంది.