వాటికి దూరంగా ఉండండి.. ప్రజలకు మహేశ్‌బాబు సూచన

By అంజి  Published on  7 April 2020 12:43 PM GMT
వాటికి దూరంగా ఉండండి.. ప్రజలకు మహేశ్‌బాబు సూచన

హైదరాబాద్‌: మహమ్మరి కరోనా వైరస్‌పై, దాని గురించి వస్తున్న వార్తలను ఉద్దేశించి మంగళవారం టాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు. భయపెట్టే, ఆందోళన కలిగించే వ్యక్తులకు దూరంగా ఉండాలంటూ ఆయన ట్వీట్‌లో పేర్కొన్నారు. సామాజిక దూరం, పరిశుభ్రతతో పాటు మరొకటి పాటించాలని నెటిజన్లకు చెప్పారు.

'మనందరం కలిసి కరోనా తుపానుతో ప్రయాణం చేస్తున్నాం.. దీన్ని ప్రతి ఒక్కరు చదవి, ప్రేమ, ఆశలను, పాజిటివిటీని వ్యాప్తి చేయాలని కోరుతున్నాను. సామాజిక దూరం, మంచి పరిశుభ్రత పాటించడంతో పాటు ముఖ్యమైన విషయాన్ని మన దృష్టిలో ఉంచుకోవాలి. భయం, ఆందోళన కలిగించే వ్యక్తల నుంచి, వార్తలకు దూరంగా ఉండండి. నకిలీ వార్తలు ప్రస్తుత విపత్కర పరిస్థితుల్లో పెద్ద సమస్యగా మారాయి. తప్పు దారి పట్టించే సమాచారానికి దూరంగా ఉండండి' అంటూ మహేశ్‌ బాబు ట్వీట్‌ చేశారు.

లాక్‌డౌన్‌ విధించి రెండు వారాలు అవుతోంది. ఈ సమయంలో మనం చాలా బలంగా ముందుకు వెళ్తున్నాం. ఐక్యతో పని చేస్తున్న ప్రభుత్వాలను మనం అభినందించాలి. ఇవాళ ప్రపంచ ఆరోగ్య దినోత్సవం.. ఈ సందర్భంగా మనం ఆరోగ్యంగా ఉండేందుకు కరోనా వైరస్‌ పోరాడేందుకు ముందు వరుసలో ఉన్నవారికి కృతజ్ఞతలు చెబుదాం.. అంటూ మహేశ్‌ ట్వీట్లు చేశారు.Next Story
Share it