స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. మ్యాచ్‌ల వివ‌రాలు..

By Newsmeter.Network  Published on  16 Feb 2020 12:16 PM GMT
స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్.. మ్యాచ్‌ల వివ‌రాలు..

ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్-2020 సీజ‌న్ ఐపీఎల్ షెడ్యూల్ విడుద‌లైంది. మ‌న జ‌ట్టు.. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ మ్యాచులు ఏఏ తేదీల్లో ఉన్నాయో తెలుసా..? అభిమానుల కోసం సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ ఫ్రాంఛైజీ ట్విట్ట‌ర్ వేదిక‌గా త‌మ షెడ్యూల్ ను విడుద‌ల చేసింది. ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ అంతర్జాతీయ స్టేడియంలో సన్‌రైజర్స్‌ జట్టు ఏప్రిల్‌ 1న ముంబయి ఇండియన్స్‌తో తొలి మ్యాచ్‌ ఆడనుంది. చివరి మ్యాచ్‌ మే 15న కోల్‌కతా నైట్‌రైడర్స్‌తో ఈడెన్‌గార్డెన్స్‌లో ఆడనుంది.

Untitled 4 Copy

ఇక ఐపీఎల్-13వ సీజ‌న్‌లో అన్ని జ‌ట్లు 14 మ్యాచులు ఆడ‌నున్నాయి. అందులో సగం మ్యాచ్‌ల‌ను సొంతమైదానంలో.. మిగ‌తా సగం ప్ర‌త్య‌ర్థి మైదానంలో ఆడ‌నున్నాయి. మొత్తం 14 మ్యాచ్‌ల వివరాలను సన్‌రైజర్స్‌ జట్టు ట్విటర్‌లో పోస్టు చేసింది. ఐపీఎల్‌ 13వ సీజన్‌.. మార్చి 29 నుంచి వాంఖడేలో ప్రారంభం కానుండ‌గా.. తొలి మ్యాచ్‌లో ముంబై ఇండియ‌న్స్, చైన్నై సూప‌ర్ కింగ్స్ త‌ల‌ప‌డ‌నున్నాయి.

ఎస్‌ఆర్‌హెచ్‌ జట్టు :

కేన్‌ విలియమ్సన్‌(కెప్టెన్‌), డేవిడ్‌ వార్నర్‌, మనీశ్‌ పాండే, విరాట్‌ సింగ్‌, ప్రియమ్‌ గార్గ్‌, అబ్దుల్‌ సమద్‌, భువనేశ్వర్‌ కుమార్‌, ఖలీల్‌ అహ్మద్‌, సందీప్‌ శర్మ, సిద్ధార్థ్‌ కౌల్‌, బిల్లీ స్టాన్‌లేక్‌, నటరాజన్‌, అభిషేక్‌ శర్మ, షహ్బాజ్‌ నదీమ్‌, మిచెల్‌ మార్ష్‌, ఫాబియన్‌ అలెన్‌, విజయ్‌ శంకర్‌, మహ్మద్‌ నబీ, రషీద్‌ ఖాన్‌, సంజయ్‌ యాదవ్‌, జానీ బెయిర్‌స్టో, వృద్ధిమాన్‌ సాహా, శ్రీవాట్స్‌ గోస్వామి, బవనక సందీప్‌, బాసిల్‌ తంపి.Next Story
Share it