ఐటీ దాడులపై స్పందించిన సునీల్‌ దాసజీ

By న్యూస్‌మీటర్ తెలుగు
Published on : 21 Oct 2019 5:53 PM IST

ఐటీ దాడులపై స్పందించిన సునీల్‌ దాసజీ

చిత్తూరు: వరదయ్యపాలెం మండలంలో గత నాలుగు రోజులుగా జరిగిన ఐటీ దాడులపై కల్కి ఆశ్రమం స్పందించింది. ఈ సందర్భంగా సునీల్‌ దాసజీ మాట్లాడారు. దేశంలోని సంస్థలపై, వ్యవస్థలపై ఐటీ అధికారులు దాడులు చేయడం సర్వ సాధారణం.. అందులో భాగంగానే కల్కి ఆశ్రమంపై ఐటీ దాడులు జరిగాయన్నారు. ఐటీ అధికారుల విచారణకు కల్కి ఆశ్రమం పూర్తిగా సహకరించిందని సునీల్‌ దాసజీ తెలిపారు. తదుపరి విచారణకు కూడా పూర్తి సహకారాన్ని అందిస్తామన్నారు. ఐటీ దాడుల తర్వాత ఆదివారం రోజు నుంచి ఆశ్రమంలో యాధావిధిగా కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. భక్తులు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని సునీల్‌ దాసజీ తెలిపారు. ఆశ్రమానికి దేశ, విదేశీ భక్తులు సర్వసాధారణంగా వస్తారని సునీల్‌ దాసజీ తెలిపారు.

Next Story