బ‌న్నీ, సుక్కు సినిమా క‌థ ఏంటి..?  ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  25 Sep 2019 12:07 PM GMT
బ‌న్నీ, సుక్కు సినిమా క‌థ ఏంటి..?  ఇంత‌కీ సెట్స్ పైకి వెళ్లేది ఎప్పుడు..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్ ప్ర‌స్తుతం అల‌.. వైకుంఠ‌పురములో సినిమా చేస్తున్నాడు. మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ ఈ సినిమాకి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. గీతా ఆర్ట్స్ మ‌రియు హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ చిత్రం సంక్రాంతి కానుక‌గా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఈ సినిమా త‌ర్వాత బ‌న్నీ సుకుమార్ తో సినిమా చేయ‌నున్న విష‌యం తెలిసిందే.

ఈ వార్త వ‌చ్చిన‌ప్ప‌టి నుంచి ఎప్పుడెప్పుడు ఈ సినిమా స్టార్ట్ అవుతుందా అని అభిమానులు ఎంతో ఆస‌క్తితో ఎద‌రు చూస్తున్నారు. కార‌ణం ఏంటంటే... బ‌న్నీ, సుక్కు కాంబినేష‌న్ లో ఆర్య‌, ఆర్య 2 చిత్రాలు రూపొందాయి. ఈ రెండు చిత్రాలు బ‌న్నీ కెరీర్‌లో చెప్పుకోద‌గ్గ చిత్రాలుగా నిలిచాయి. అందుక‌నే బ‌న్నీ, సుక్కు సినిమా అంటే... ఆ క్రేజ్ మామూలుగా ఉండ‌దు. ఈ క్రేజీ మూవీని మైత్రీ మూవీస్ మేక‌ర్స్ నిర్మిస్తున్నారు.

ఇక క‌థ విష‌యానికి వ‌స్తే... ఎర్ర‌చంద‌నం స్మ‌గ్లింగ్ బ్యాక్ డ్రాప్ లో క‌థ ఉంటుంది. యాక్ష‌న్ ఎక్కువుగా ఉండే ఈ సినిమాలో మంచి ల‌వ్ స్టోరీ కూడా ఉంటుంద‌ట‌. ఈ సినిమా స్టోరీ డిస్క‌ష‌న్స్ ఇటీవ‌ల గోవాలో జ‌రిగాయి. స్క్రిప్ట్ దాదాపుగా ఫైన‌ల్ అయింది. మ‌రో వైపు లొకేష‌న్ సెర్చింగ్, కాల్షీట్ల కేటాయింపు, కాస్ట్యూమ్స్ సెల‌క్ష‌న్ వంటి ప‌నుల‌న్నీ జ‌రుగుతున్నాయి. ఈ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు ఓ కొలిక్కి వ‌చ్చాక అక్టోబ‌ర్ 3న ఈ సినిమా పూజా కార్య‌క్ర‌మాలు భారీ ఎత్తున నిర్వ‌హించ‌డానికి ప్లాన్ చేస్తున్నార‌ని తెలిసింది.

అక్టోబ‌ర్ 15 నుంచి సుకుమార్ సినిమా రెగ్యుల‌ర్ షూటింగ్ ఉంటుంది. నెలాఖ‌రు వ‌ర‌కు తొలి షెడ్యూల్ జ‌రుగుతుంది. ఆ త‌ర్వాత సెకండ్ షెడ్యూల్‌కి మాత్రం రెండు నెల‌లు గ్యాప్ ఉంటుంది. ఆ లోపు బ‌న్ని త్రివిక్ర‌మ్ సినిమాను కంప్లీట్ చేస్తారు. మ‌రి.. ఆర్య‌, ఆర్య 2 సినిమాల‌తో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన బ‌న్నీ - సుక్కు ఈసారి ఏ స్ధాయి విజ‌యాన్ని సాధిస్తారో..? ఎలాంటి రికార్డులు క్రియేట్ చేస్తారో చూడాలి.

Next Story
Share it