సుజీత్‌ లేని లోటును తీర్చుకొండి.. మీకు నేనుంటా.. : లారెన్స్‌

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  30 Oct 2019 11:37 AM IST
సుజీత్‌ లేని లోటును తీర్చుకొండి.. మీకు నేనుంటా.. : లారెన్స్‌

తమిళనాడు: తిరుచ్చిలో ఈ నెల 25న ప్రమాదవశాత్తూ బోరు బావిలో పడిపోయిన రెండేళ్ల బాలుడు సుజీత్ విల్సన్ కన్నుమూసిన విషయం అందరికి తెలిసిందే. అధికారులు నాలుగు రోజులుగా చేసిన ప్రయత్నాలన్నీ విఫలం అయ్యాయి. బాలుడి మృతదేహాన్ని బోరు బావి నుంచి వెలికితీసారు. ఈ నేపథ్యంలో సుజీత్‌ మృతి పట్ల ప్రముఖులు, నాయకులు తమదైన రీతిలో స్పందించారు. ప్రముఖ దర్శకుడు, హీరో రాఘవ లారెన్స్‌ ఓ ఇంట్రెస్టింగ్ ట్వీట్‌ చేశారు. చిన్నారి మృతికి చింతిస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే సుజీత్‌ తల్లిదండ్రులకు లారెన్స్‌ విజ్ఞప్తి చేశారు. వీలైతే ఓ బిడ్డను దత్తత తీసుకొని.. సుజీత్ లేని లోటును తీర్చుకోవాలని సూచించారు. ఈ విజ్ఞప్తి పట్ల మీరు సానుకూలంగా స్పందిస్తే ఆ బిడ్డ చదువులకు అవసరమయ్యే ఖర్చులను భరిస్తానని లారెన్స్‌ చెప్పారు. అయితే ఈ ప్రతిపాదనకు సుజీత్‌ తల్లిదండ్రులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి మరీ.

సుజీత్ మరణం తమిళనాడునే విషాదంలో ముంచింది. కోలీవుడ్ స్టార్లు తీవ్ర దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. అన్ని పార్టీల రాజకీయ నేతలు సుజీత్ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.



Next Story