మంత్రుల ప్రకటనల వల్లే ఆత్మహత్యలు - రేవంత్ రెడ్డి

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  19 Oct 2019 7:08 AM GMT
మంత్రుల ప్రకటనల వల్లే ఆత్మహత్యలు - రేవంత్ రెడ్డి

సూర్యాపేట: కేసీఆర్‌ రాచరిక పాలన చేస్తున్నారని విమర్శించారు టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి. టీపీసీసీ కార్యదర్శి పటేల్‌ రమేష్‌ రెడ్డి నివాసంలో రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. కార్మికుల బలిదానాలకు కారణం కేసీఆర్‌ తీరేనని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొనని మంత్రుల బాధ్యతారహితమైన వ్యాఖ్యల వల్లనే కార్మికులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారన్నారు. తెలంగాణ ప్రజల పొట్టకొట్టి కేసీఆర్‌ బతుకుతున్నారని రేవంత్‌రెడ్డి విమర్శించారు. కేసీఆర్‌ తెలంగాణ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రంగా మార్చారన్నారు. మద్యం అమ్మకాల్లో మాత్రం దేశంలోనే నెంబర్‌ వన్‌ ప్లేస్‌లో ఉందన్నారు.

హుజుర్‌నగర్‌ ఉప ఎన్నికలే తెలంగాణ భవిత్యాన్ని నిర్ణయిస్తాయని రేవంత్‌ రెడ్డి అన్నారు. హుజుర్‌నగర్‌ ఎన్నికలు కేసీఆర్‌ పతనానికి నాంది పలుకుతాయన్నారు. కేసీఆర్‌ అరాచకపాలన పోవాలంటే హుజుర్‌నగర్‌లో టీఆర్‌ఎస్‌ను ఓడగొట్టాలన్నారు. సీఎం కేసీఆర్‌ మంత్రివర్గం రెండు వర్గాలు చీలిపోయిందన్నారు. ఉద్యమ మంత్రులు ఆర్టీసీ సమ్మెపై మాట్లాడటం లేదన్నారు. ఉద్యోగులను సెల్ఫ్‌ డిస్మిస్‌ చేసే అధికారం కేసీఆర్‌కు లేదని రేవంత్‌ రెడ్డి అన్నారు.

Next Story