కరోనా భయం: భవనంపై నుంచి దూకి ఆత్మహత్య
By సుభాష్ Published on 2 May 2020 6:27 PM IST
కరోనా వైరస్ భయంతో మానసిక అందోళన చెందిన ఓ వ్యక్తి భవనంపై నుంచి దూకి ఆత్మహత్యక పాల్పడ్డాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు హైదరాబాద్ లోని రామాంతపూర్‌లోని ఓ అపార్టుమెంట్‌లో నివసించే కృష్ణమూర్తి (65) గత కొంత కాలంగా గ్యాస్ సమస్యతో బాధపడుతున్నాడు. తరచూ ఆయాసం రావడంతో కరోనా సోకిందేమోనని ఆందోళన చెందాడు. దీంతో కుటుంబ సభ్యులు కోఠి ఆస్పత్రికి తీసుకెళ్లగా కరోనా ఏమి లేదని వైద్యులు తెలిపారు. అయినప్పటికీ కృష్ణమూర్తిలో ఆందోళన ఏ మాత్రం తగ్గలేదు.
మరింత ఆందోళన చెందుతుండటంతో శనివారం గాంధీ ఆస్పత్రికి వెళ్దామని కుటుంబ సభ్యులు సిద్దమవుతుండగా.. కృష్ణమూర్తి అపార్టుమెంట్‌లో ఉన్న బాల్కనీ నుంచి కిందకు దూకడంతో తల పగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.