సుడిగాలి సుధీర్ చెంప చెళ్లుమ‌నిపించిన 'రోజా'..!

By Newsmeter.Network  Published on  29 Dec 2019 8:43 AM GMT
సుడిగాలి సుధీర్ చెంప చెళ్లుమ‌నిపించిన రోజా..!

న‌గ‌రి ఎమ్మెల్యే ఆర్‌కే రోజా జ‌బ‌ర్ద‌స్త్ క‌మెడియ‌న్ సుడిగాలి సుధీర్ చెంప చెళ్లుమ‌నిపించింది. సుధీర్ వ‌ల్ల మోస పోయిన అమ్మాయి న్యాయం చేయాలంటూ రోజాను ఆశ్ర‌యించింది. అయితే, సుధీర్ మాత్రం త‌న‌కేమీ ప‌ట్ట‌న‌ట్టు ఆమె ఎవ‌రో నాకు ప‌రిచ‌యం లేదండి అని చెప్ప‌డంలో ఆగ్ర‌హించిన రోజా అప్ప‌టి వ‌ర‌కు కూర్చున్న కుర్చీ నుంచి పైకి లేచి మ‌రీ చెంప‌పై చేతికున్న‌ ఐదేళ్లు క‌నిపించేలా మ‌రీ సీరియ‌స్ వార్నింగ్ ఇచ్చింది.

సీన్ క‌ట్ చేస్తే, స్టేజ్‌పై ఉన్న అంద‌రి ముఖాల్లో న‌వ్వులు. అవును, మీరు ఊహిస్తున్న‌ట్టు ఇది జ‌రిగింది బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే షోలోనే. అయితే, సుడిగాలి సుధీర్ చెంప‌ను రోజా చెళ్లుమ‌నిపించ‌డం మాత్రం వాస్త‌వం. ఇది ఆ షో ప్రోమో చూస్తే మీరూ ఒప్పుకోక త‌ప్ప‌దు. అదేంటి..? త‌న షోల‌లో పాటిస్పేట్ చేసే క‌మెడియ‌న్ల‌ను రోజా చాలా ప్రేమ‌గా చూసుకుంటుంది క‌దా..? అటువంటిది సుడిగాలి సుధీర్‌నే ఎందుకు అలా..? అన్న డౌట్ మీకు రావొచ్చు. అదంతా తెలుసుకోవాలంటే ఈ క‌థ‌నాన్ని పూర్తిగా చ‌ద‌వాల్సిందే మ‌రీ..!

న‌గ‌రి ఎమ్మెల్యేగా ఉన్న రోజా ప్ర‌జా స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్త‌డంలో త‌న‌కు తానే సాటి. మ‌రీ ముఖ్యంగా మ‌హిళ‌ల‌పై జ‌రుగుతున్న అన్యాయాల‌పై సూటిగా సుత్తి లేకుండా ప్ర‌శ్నించ‌డం రోజా నైజం. అటువంటి రోజా వ‌ద్ద‌కు త‌మ కాపురంలో త‌లెత్తిన స‌మ‌స్య‌ను ప‌రిష్కరించాలంటూ ఎవ‌రైనా దంప‌తులు వ‌స్తే..? ఎలా ఉంటుందో ఇట్టే ఊహించుకోవ‌చ్చు. అంతెందుకు రోజా న్యాయ నిర్ణేత‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న ర‌చ్చ‌బండ షోను చూస్తే చాలు అర్ధ‌మైపోతుంది.

ఒక‌వేళ త‌ప్పు మ‌హిళవైపు ఉన్న‌ట్టు తేలితే సాటి మ‌హిళ అని కూడా చూడ‌కుండా ప్ర‌శ్న‌ల వ‌ర్షం కురిపిస్తుంది. కాపురం స‌జావుగా సాగ‌డానికి మార్గాల‌ను వెతికి మ‌రీ వారి స‌మ‌స్య‌కు ప‌రిష్కారం చూపుతుంది. అటువంటి రోజాను సేమ్ సీన్‌లో మ‌ళ్లీ న‌టించ‌మంటే ఇంకేముంది న‌టించ‌డం కాదు.. జీవించేస్తుంది. రోజా అలా చేయ‌డం మూలంగానే ఇప్పుడు సుడిగాలి సుధీర్ చెంప చెల్లుమంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే, తాజాగా విడుద‌లైన ఓ బుల్లితెర షో ప్రోమోలో రోజాతోపాటు సుడిగాలి సుధీర్, గెట‌ప్ శ్రీ‌ను, ఆటోపంచ్ రామ్‌ప్ర‌సాద్ క‌నిపించారు. షోలో భాగంగా ర‌త్న వేలు క్యారెక్ట‌ర్‌లో ఉన్న‌ గెట‌ప్ శ్రీ‌ను ఓ లేడీ కంటెస్టెంట్‌ను త‌న‌వెంట తీసుకొచ్చి అమ్మా మీరే ఎలాగైనా న్యాయం చేయాల‌మ్మా అని న్యాయ నిర్ణేత‌గా ఉన్న రోజాను వేడుకుంటాడు. దీంతో మిస‌నైస్ క్యారెక్ట‌ర్‌లో ఉన్న సుడిగాలి సుధీర్ ఆ అమ్మాయి ఎవ‌రో త‌న‌కు తెలియ‌ద‌ని చెప్ప‌డంతో ఒక్క‌సారిగా రోజా ఫైర్ అవుతుంది.

అస‌లే ర‌చ్చ‌బండ వంటి షోలు చేసిన అనుభ‌వం ఉన్న రోజా ఆ అమ్మాయి ఎవ‌రో తెలియ‌దంటావా..? అంటూ ముందుగా ఆటో రామ్‌ప్ర‌సాద్‌ను ఆర్టిఫిషియ‌ల్ చెంప‌దెబ్బ కొట్టి, ఆ త‌రువాత ఏమరుపాటులో ఉన్న సుధీర్‌పై సైతం చేయి చేసుకుంటుంది. రామ్‌ప్ర‌సాద్‌ది ఆర్టిఫిషియ‌లే అయినా.., సుధీర్ చెంప‌దెబ్బ మాత్రం ఒరిజిన‌ల్‌. ఇది ఆ ప్రోమో చూసిన ప్ర‌తి ఒక్క‌రికి ఇట్టే అర్ధ‌మ‌వుతుంది. ఏదేమైనా మ‌హిళ‌ల స‌మ‌స్య‌ల‌పై గ‌ళ‌మెత్తే రోజాకు ఇటువంటి క్యారెక్ట‌ర్ ఇస్తే న‌టించ‌డం కాదు.. జీవించేస్తుంద‌ని, రోజాను ఏ మాత్రం త‌ప్పుబ‌ట్టేందుకు వీలు లేదంటూ నెటిజ‌న్లు వారి అభిప్రాయాన్ని వ్య‌క్తం చేస్తున్నారు.

Next Story
Share it