ర‌ష్మీతో క‌లిసి సిక్స్‌ప్యాక్‌తో సుడిగాలి సుధీర్ ఎంట్రీ..!

By అంజి  Published on  21 Jan 2020 4:21 AM GMT
ర‌ష్మీతో క‌లిసి సిక్స్‌ప్యాక్‌తో సుడిగాలి సుధీర్ ఎంట్రీ..!

వరుస అవ‌కాశాల‌ను ద‌క్కించుకుంటూ దూసుకుపోతున్నాడు సుడిగాలి సుధీర్. ఇటీవ‌ల రిలీజై గ్రాండ్ స‌క్సెస్ సాధించిన సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా సుధీర్‌కు క‌లిసొచ్చింద‌నే చెప్పాలి. ఆ మూవీ హిట్‌తో సుధీర్‌కు మూవీ ఆఫ‌ర్స్ బాగానే వ‌స్తున్నాయి. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా క‌లెక్ష‌న్లు కూడా బాగానే రావ‌డంతో సుధీర్ రెండో సినిమాపై అంచ‌నాలు కాస్త పెర‌గ‌డంతోపాటు ఆయ‌న అభిమానులు కూడా బాగానే ఆశ‌లు పెట్టుకున్నారు.

ఇదిలా ఉంటే.. త‌న నెక్ట్స్ మూవీకి సుధీర్ సిక్స్ ప్యాక్ ఎంట్రీ ఇస్తాడ‌ని తెలుస్తుంది. నిజానికి సిక్స్ ప్యాక్ చేయ‌డ‌మంటే అంత ఆషామాషీ కాద‌ని అంద‌రికి తెలిసిందే. సుధీర్ త‌న బిజీ లైఫ్‌లో జిమ్‌కు వెళ్లి వ‌ర్క‌వుట్స్ చేసి సిక్స్ ప్యాక్ చేయ‌డ‌మంటే మామూలు మేట‌ర్ కాదు. కానీ, త‌న‌కు సినిమా అవ‌కాశాలు వ‌స్తున్న నేప‌థ్యంలో సిక్స్‌ప్యాక్ త‌ప్పేలా లేద‌ని సుధీర్ అభిమానులు భావిస్తున్నారు.

ఇక ర‌ష్మీ సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమా హీరోయిన్ ఆఫ‌ర్‌ను వ‌దులుకుని పెద్ద త‌ప్పే చేసింద‌ని చెప్పాలి. కానీ, త్వ‌ర‌లోనే ర‌ష్మీ, సుధీర్ జంట‌గా ఒక సినిమా ప‌ట్టాలెక్క‌బోతుంద‌ని స‌మాచారం. బ‌హుశా ఆ సినిమా కోస‌మే సుధీర్ సిక్స్‌ప్యాక్ ఆలోచ‌న‌లో ఉన్న‌ట్టు తెలుస్తుంది.

మ‌రోప‌క్క సుధీర్ సిక్స్ ప్యాక్ చేయ‌డంపై ర‌ష్మీ ఒకింత షాక్‌కు గురైంద‌ని, సుధీర్ అభిమానులు కూడా షాక్‌లోనే ఉన్నార‌న్న వైర‌ల్ న్యూస్ ఫిల్మ్‌న‌గ‌ర్ స‌ర్కిల్స్‌లో తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. సుధీర్ కెరీర్‌లో సినిమా ఎంత ఇంపార్టెంటో.. షోలు కూడా అంతే ఇంపార్టెంట్ అన‌డంలో ఎటువంటి అతిశ‌యోక్తి లేదు. అలాంటి బిజీ ప‌ర్స‌న్ సిక్స్ ప్యాక్ అంటే కొంచెం క‌ష్ట‌మేన‌ని చెప్పాలి.

కానీ, సుధీర్ అభిమానులు కోరుకుంటే.. సిక్స్‌ప్యాక్‌కు వెనుకాడ‌డ‌ని, మ‌రికొద్ది రోజుల్లో సుధీర్ ర‌ష్మీకి సంబంధించిన మూవీ అనైన్స్‌మెంట్ ఇవ్వ‌నున్నార‌ని తెలుస్తుంది. ఇదిలా ఉండ‌గా, ఈ నెల‌లోనే సుధీర్ రెండో సినిమా త్రీ మంకీస్ కూడా విడుద‌ల కానుంది. సాఫ్ట్‌వేర్ సుధీర్ సినిమాలాగానే తన రెండో సినిమా కూడా సూప‌ర్ హిట్ కావాల‌ని సుధీర్ అభిమానులు కోరుకుంటున్నారు. సుధీర్ ర‌ష్మీ చేయ‌బోయే సినిమాకు ఇంకా ఎటువంటి క్యాస్టింగ్, క్రూ ఫిక్స్ కాలేదు. కానీ, ఒక మంచి డైరెక్ట‌ర్‌తో వీరిద్ద‌ర్ని డైరెక్ట్ చేయ‌బోతున్నార‌ని తెలిసింది.

Next Story
Share it