రుచి, వాసన తెలియడం లేదా ? వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి..

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  14 Jun 2020 10:57 AM GMT
రుచి, వాసన తెలియడం లేదా ? వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోండి..

కరోనా మన దేశంపైకి దండయాత్ర చేసి సుమారు 4 నెలలు పూర్తవుతున్నా.. చూస్తుండగానే దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల సంఖ్య 3 లక్షలు దాటేసింది. ఒక్క మహారాష్ట్రలోనే లక్షకు పైగా కేసులు నమోదవ్వడం ఆందోళన కలిగిస్తోంది. పైగా మహారాష్ట్ర తెలంగాణ సరిహద్దు రాష్ట్రం. దీంతో హైదరాబాద్ లో సైతం కరోనా కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇదిలా ఉంటే.. తాజాగా కేంద్ర, ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంచలన ప్రకటన చేసింది. రుచి, వాసన చూడటం తెలియకపోయినా వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందిగా ప్రజలను హెచ్చరించింది.

ఇప్పటి వరకూ చికిత్స పొందుతున్న కరోనా రోగులను వారికున్న లక్షణాల గురించి అడిగిన వైద్యులకు వారికి రుచి, వాసన కూడా తెలియడం లేదని తెలిసింది. దీంతో కరోనా సోకిన వారికి ఈ లక్షణాలు కూడా ఉంటున్నాయని గ్రహించిన కేంద్రం..అవి ఉన్నవారు కూడా కరోనా నిర్థారణ పరీక్షలు చేయించుకోవాలని తెలిపింది. ఈ రెండిటితో కలిపి కరోనా లక్షణాలు 14కు చేరాయి. జ్వరం, దగ్గు, జలుబు, ఆయాసం, డయేరియా, కఫం, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, గొంతు నొప్పి, రుచి, వాసన తెలియకపోవడం తదితర సమస్యలుంటే కరోనా పరీక్షలు చేయించుకోవాల్సిందే..

Next Story