ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 294 పాజిటివ్ కేసులు

By సుభాష్  Published on  14 Jun 2020 10:15 AM GMT
ఏపీలో రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 294 పాజిటివ్ కేసులు

ఏపీలోకరోనా వైరస్‌ తీవ్రత కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 294 కేసులు నమోదు కాగా, ఇద్దరు మృతి చెందారు. ఇప్పటి వరకూ మొత్తం కేసుల సంఖ్య 6152కు చేరింది. అయితే ఇందులో రాష్ట్రంలో కొత్తగా 253 కేసులు ఉండగా, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారివి 39 కేసులున్నాయి. ఇప్పటి వరకూ 84 మంది మరణించగా, 2752 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి.

ఇక రాష్ట్రంలో కొత్తగా 15,633 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో 253 మందికి పాజిటివ్‌ తేలింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 4841కి చేరింది. వారిలో 84 మంది డిశ్చార్జ్‌ కాగా, ఇప్పటి వరకూ మొత్తం డిశ్చార్జ్‌ అయిన వారి సంఖ్య 2723కు చేరింది. అలాగే ప్రస్తుతం రాష్ట్రంలో 2034 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక విదేశాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా ఇద్దరికి కరోనా వైరస్‌ సోకగా, వారికి సంబంధించిన కేసుల సంఖ్య 204కు చేరింది. అందులో తాజాగా ఒకరు డిశ్చార్జ్‌ అయ్యారు. అలాగే వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన వారిలో కొత్తగా 39 మందికి పాజిటివ్‌ నిర్ధారణ కాగా, మొత్తం కేసుల సంఖ్య 1107కు చేరింది. వీరిలో 48 మంది డిశ్చార్జ్‌ కాగా, 537 మంది చికిత్స పొందుతున్నారు.

ఇక తెలంగాణలో కూడా కరోనా తీవ్ర స్థాయిలో ఉంది. నిన్న ఒక్క రోజు 253 నమోదయ్యాయి. ఇప్పటి వరకూ తెలంగాణలో 4737 కేసులు నమోదయ్యాయి.. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన 449 మంది ఉన్నారు. కరోనా కారణంగా నేడు మరో 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 182కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2203గా ఉంది. వైరస్ నుంచి 2352 మంది కోలుకున్నారు.

ఇక తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా తెలుగు రాష్ట్రాల ఆరోగ్యశాఖలు విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ను చూస్తుంటే గుండెల్లో దడ పుట్టించేలా ఉంది.

Next Story
Share it