తెలంగాణ: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 253 కేసులు.. ఎంత మంది మృతి అంటే..

By సుభాష్  Published on  13 Jun 2020 4:27 PM GMT
తెలంగాణ: రికార్డు స్థాయిలో కరోనా కేసులు.. కొత్తగా 253 కేసులు.. ఎంత మంది మృతి అంటే..

లాక్‌డౌన్ ఎత్తివేయడంతో తెలంగాణలో కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కేసులు వెలుగు చూశాయి. దీంతో రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4737కు చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో పాటు విదేశాల నుంచి వచ్చిన 449 మంది ఉన్నారు. కరోనా కారణంగా నేడు మరో 8 మంది చనిపోయారు. దీంతో రాష్ట్రంలో కరోనా వల్ల చనిపోయిన వారి సంఖ్య 182కు చేరింది. ఇక ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా కరోనా యాక్టివ్ కేసుల సంఖ్య 2203గా ఉంది. వైరస్ నుంచి 2352 మంది కోలుకున్నారు.

తెలంగాణలో కరోనా వైరస్‌ ఉగ్రరూపం దాల్చుతోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటంతో మరింత ఆందోళన వ్యక్తం అవుతోంది. కరోనా కట్టడికి ప్రభుత్వం ఎన్ని చర్యలు చేపట్టినా రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతున్నాయి. తాజాగా తెలంగాణ ఆరోగ్యశాఖ విడుదల చేసిన హెల్త్‌ బులిటెన్‌ను చూస్తుంటే గుండెల్లో దడ పుట్టించేలా ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 253 కరోనా కేసులు నమోదు కాగా, 8 మంది మృతి చెందారు. ఇక ఇప్పటి వరకూ రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 4737 కాగా, మరణాల సంఖ్య 182కు చేరుకుంది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారితో కరోనా వల్ల మృతుల సంఖ్య పెరుగుతోంది. ఇక ప్రస్తుతం రాష్ట్రంలో 2203 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 2352 మంది కోలుకున్నారు. లాక్‌డౌన్‌ ఎత్తివేసిన కారణంగా కేసుల సంఖ్య ఒక్కసారిగా పెరిగిపోయాయి.

కొత్తగా ఎక్కడ ఎన్ని కేసులు నమోదయ్యాయంటే..

జీహెచ్‌ఎంసీలో - 179

సంగారెడ్డి - 24

మేడ్చల్‌ - 14

రంగారెడ్డి - 11

మహబూబ్‌నగర్‌ -4

వరంగల్‌ రూరల్‌ - 2

వరంగల్‌ అర్బన్‌ - 2

మంచిర్యాల - 2

కరీంనగర్‌ -2

నల్గొండ - 2

ములుగు - 2

సిరిసిల్ల - 2

సిద్దిపేట -1

ఖమ్మం - 1

మెదక్‌ - 1

నిజామాబాద్‌ - 1

నాగర్‌ కర్నూలు -1

కామారెడ్డి - 1

జగిత్యాల్‌ -1

Ts Coronavirus

Next Story