ఈ సాయంత్రం పద్మ అవార్డుల ప్రదానం

By -  Nellutla Kavitha |  Published on  21 March 2022 9:19 AM GMT
ఈ సాయంత్రం పద్మ అవార్డుల ప్రదానం

రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఈ రోజు పద్మ అవార్డులను బహూకరించనున్నారు. 2022 సంవత్సరానికి గాను 128 పద్మ అవార్డులను ఇవ్వనున్నారు. ఇందులో నాలుగు పద్మవిభూషణ్, 17 పద్మభూషణ్, 107 పద్మశ్రీ అవార్డులు ఉన్నాయి. ఈ జాబితాలో 34 మంది మహిళలు ఉంటే, 10 మంది విదేశీయులు, 13 మందికి మరణానంతరం పద్మా అవార్డులను అందజేయనున్నారు. ప్రతి యేటా గణతంత్ర దినోత్సవం రోజున పద్మ అవార్డులను అనౌన్స్ చేస్తూ ఉంటారు. పద్మ అవార్డుల ప్రధానం రాష్ట్రపతి భవన్లో, రాష్ట్రపతి చేతుల మీదుగా జరుగుతుంది. మేజర్ జనరల్ బిపిన్ రావత్ కు మరణానంతరం పద్మవిభూషణ్ అని అనౌన్స్ చేశారు. ఇక కోవిడ్ వ్యాక్సిన్లను రూపొందించిన భారత్ బయోటెక్, సీరం ఇన్స్టిట్యూట్ వ్యవస్థాపకులు cyrus poonawalla, కృష్ణ ఎల్లా - సుచిత్ర ఎల్లా దంపతులకు పద్మభూషణ్ ని ప్రధానం చేయనున్నారు

Next Story