హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో సీఏఏపై బీజేపీ రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్మణ్య స్వామి ప్రసంగం రసాభాసగా మారింది. ఏబీవీపీ నిర్వహించిన సీఏఏపై అవగాహన కార్యక్రమాల్లో సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడారు. ఇండియాలో పుట్టిన ముస్లిం మైనారిటీలకు సీఏఏ వ్యతిరేకంగా కాదన్నారు. స్వాతంత్ర్యం అనంతరం ఇతర దేశాల నుంచి వచ్చిన 33వేల పైచిలుకు హిందువులను తప్పకుండా సిటిజన్ షిప్ ఇవ్వనున్నట్లు స్వామి చెప్పారు. ఇండియా పుట్టి పెరిగిన ఏ ఒకరిని తొలగించమన్నారు. సుబ్రహ్మణ్య స్వామి మాట్లాడుతుండగా.. కొందరు సీఏఏకు వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో సమావేశం గందరగోళంగా మారింది.

Newsmeter.Network

Next Story