బ‌న్నీ మూవీ ఆగిపోయిందా..?

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  29 Oct 2019 12:30 PM GMT
బ‌న్నీ మూవీ ఆగిపోయిందా..?

స్టైలీష్ స్టార్ అల్లు అర్జున్.. నా పేరు సూర్య, నా ఇల్లు ఇండియా, సినిమా ఫ్లాప్ ఆత‌ర్వాత చాలా క‌థ‌లు విని త్రివిక్ర‌మ్ క‌థ‌ను ఓకే చేయ‌డం.. అదే 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' తెర‌కెక్కుతుండ‌డం తెలిసిందే. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ సంస్థ‌లు సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సంక్రాంతి కానుక‌గా ఈ సినిమా జ‌న‌వ‌రి 12 విడుద‌ల కానుంది. ఈ సినిమాతో పాటు బ‌న్నీ సుకుమార్ క‌థ‌ను, వేణు శ్రీరామ్ క‌థ‌ను కూడా ఓకే చేశాడు.

అయితే... 'అల‌.. వైకుంఠ‌పుర‌ములో' షూటింగ్ కంప్లీట్ అయ్యాకా సుకుమార్ తో సినిమాను, వేణు శ్రీరామ్ తో సినిమాను ఓకేసారి చేయాలి అనుకున్నాడు. అయితే... సుకుమార్ తో సినిమాను బుధ‌వారం ప్రారంభించనున్నాడ‌ట‌. ఈ సినిమాని మైత్రీ మూవీ మేక‌ర్స్ సంస్థ నిర్మించ‌నుంది. ఈ సినిమాతో పాటు చేయాల‌నుకున్న వేణు శ్రీరామ్ ఐకాన్ మూవీని ప‌క్క‌న పెట్టేసాడ‌ని వార్త‌లు వ‌స్తున్నాయి.

కార‌ణం ఏంటంటే.. స్టోరీ లైన్ విని బాగా ఇంప్రెస్ అయిన బ‌న్నీ ఫుల్ స్టోరీ విన్నా త‌ర్వాత ఎందుక‌నో.. ఈ సినిమాని చేయ‌కుండా ఉండ‌డ‌మే బెస్ట్ అని ఫీల‌య్యాడ‌ట‌. అందుక‌నే బ‌న్నీ... వేణు శ్రీరామ్‌తో చేయాల‌నుకున్న 'ఐకాన్ మూవీ'ని క్యాన్సిల్ చేసుకున్నాడు... అని ఫిల్మ్ న‌గ‌ర్ లో టాక్ వినిపిస్తోంది. మ‌రి..ఈ ప్ర‌చారంలో ఉన్న వార్త వాస్త‌వ‌మేనా..? కాదా..? అనేది తెలియాల్సివుంది.

Next Story
Share it