బ‌న్నీ ఇవ్వ‌నున్న‌ స‌ర్ ఫ్రైజ్ రేపే..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  13 Nov 2019 12:56 PM GMT
బ‌న్నీ ఇవ్వ‌నున్న‌ స‌ర్ ఫ్రైజ్ రేపే..!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌, మాట‌ల మాంత్రికుడు త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ కాంబినేష‌న్‌లో రూపొందుతున్న హ్యాట్రిక్ మూవీ 'అల‌...వైకుంఠ‌పుర‌ములో..'. బ‌న్నీ స‌ర‌స‌న పూజా హేగ్డే న‌టిస్తుంది. గీతా ఆర్ట్స్, హారిక & హాసిని క్రియేష‌న్స్ బ్యాన‌ర్స్ పై ప్ర‌తిష్టాత్మ‌కంగా రూపొందుతోన్న ఈ మూవీ శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది.

ఇటీవ‌ల రిలీజ్ చేసిన ఈ చిత్రంలోని రెండు పాట‌లు యూట్యూబ్ లో సెన్సేష‌న్ క్రియేట్ చేసిన విష‌యం తెలిసిందే. రేపు బాల‌ల దినోత్స‌వం సంద‌ర్భంగా బ‌న్నీ ఓ స‌ర్ ఫ్రైజ్ ఇవ్వ‌నున్నాడ‌ట‌. ఇంత‌కీ అది ఏంటంటే.. 'ఓఎంజీ డాడీ...' అంటూ సాగే మూడో పాటను రేపు ఉద‌యం ప‌ది గంట‌ల‌కు విడుద‌ల చేయ‌నున్నార‌ట‌. ఈ విష‌యాన్ని తెలియ‌చేస్తూ చిత్ర యూనిట్ ఓ పోస్టర్ రిలీజ్ చేసింది.

ఆస‌క్తిక‌ర‌మైన విష‌య‌మేమంటే... ఈ పాట‌ను ఇద్ద‌రు స్పెష‌ల్ గెస్ట్‌లు విడుద‌ల చేస్తార‌ట‌. అయితే... ఆ ఇద్ద‌రు సెల‌బ్రీటీలు ఎవ‌రు అనేది మాత్రం చెప్ప‌లేదు. వాళ్లు ఎవ‌రు అనేది తెలియాలంటే రేప‌టి వ‌ర‌కు ఆగాల్సిందే.

Next Story