పారిస్‌లో ఆ డ్యాన్సర్స్‌తో అల్లు అర్జున్ స్టెప్పులు.. సినిమాకే హైలెట్ అంటా..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on : 10 Nov 2019 12:00 PM IST

'అల వైకుంఠపురంలో' సామాజవరగమన సాంగ్ షూట్‌కి పారిస్ వెళ్లిన విషయం తెలిసిందే. పారిస్‌లో లిడో డాన్సర్స్‌తో షూట్ చేసిన ఫస్ట్ సాంగ్ ఇదే అవ్వడం విశేషం. అయితే ఫస్ట్ టైమ్ సౌత్ ఇండియన్ స్టార్ పారిస్‌లో లిడో డాన్సర్స్ తో డాన్స్ చేసిన స్టార్ గా అల్లు అర్జున్ అవ్వటం విశేషం.. గత 25 సవత్సరాలకి పైగా ఈ లిడో డాన్స్ ఫేమౌస్ అని అందరికి తెలిసిన విషయమే.
ఆడియో పరంగా ఇంతటి సెన్సేషన్ సృష్టించిన ఈ సాంగ్‌ను పారిస్‌లోని అందమైన లొకేషన్లలో చిత్రీకరించడమే ఒక హైలెట్ అయితే దీనికి తోడు లిడో డాన్సర్లు యాడ్ అవ్వడంతో సాంగ్ పై అంచనాలు మరింత పెరిగాయి. ఈ చిత్రంలో రాములో రాముల కూడా ఇంస్టెంట్ హిట్ గా నిలిచింది. సంక్రాంతి కానుకగా జనవరి 12న 'అల వైకుంఠపురంలో' ముందుకు రానుంది. ఈ చిత్రానికి సంబంధించిన మరికొన్ని సర్ప్రైజ్ అప్డేట్స్ త్వరలో రానున్నాయి.
Next Story