కాలేజ్ లెక్చరర్‌ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  4 Nov 2019 8:43 AM GMT
కాలేజ్ లెక్చరర్‌ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య

హైదరాబాద్: మీర్ పేట్ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో తీగల రాంరెడ్డి పాల్ టెక్ని క్ కాలేజి యాజమాన్యం వేధింపులు ఓ విద్యార్థిని ఆత్మహత్యకు దారితీశాయి. కాలేజ్‌ లెక్చరర్‌ పార్వతి వేధింపులు భరించలేక పాల్ టెక్నిక్ ఫైనల్ చదుతున్న సంధ్య అనే విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్ కు ఉరివేసుకుని బలవర్మరణానికి పాల్పడింది. ఈ ఘటన మీర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. దీంతో తోటి విద్యార్థులకు యాజమాన్యం దౌర్జన్యంపై ఆందోళన చేపట్టారు. గేటు మందు బైఠాయించి న్యాయం చేయాలంటూ నిరసనకు దిగారు.

Next Story
Share it