సంగారెడ్డి: కందిలోని హైదరాబాద్‌ ఐఐటీలో విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వసతి గృహం నుంచి దూకి బీటెక్‌ విద్యార్థి సిద్దార్థ్‌ ప్రాణాలు తీసుకున్నాడు. మృతుడు సిద్దార్థ్‌ కంప్యూటర్‌ సైన్స్‌ మూడో సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం రాత్రి వసతి గృహం మీది నుంచి దూకి సిద్దార్థ్‌ ఈ దారుణానికి పాల్పడ్డాడు. సిద్దార్‌ మృతి చెందినట్టు తోటిమిత్రులు అతడి తల్లిదండ్రులకు సమాచారం అందించారు. సిద్దార్థ్‌ స్వస్థలం కుత్బులాపూర్‌కు మృతదేహన్ని తరలించారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.