మంత్రి హరీశ్‌రావు చొర‌వ‌తో.. క్షేమంగా ఇంటికి చేరిన విద్యార్థిని

By తోట‌ వంశీ కుమార్‌  Published on  20 April 2020 8:47 AM GMT
మంత్రి హరీశ్‌రావు చొర‌వ‌తో.. క్షేమంగా ఇంటికి చేరిన విద్యార్థిని

గ‌జ్వేల్‌కి చెందిన ఓ విద్యార్థిని కాలేజీకి సెల‌వులు ఇవ్వ‌డంతో .. ఏపీలోని త‌న స్నేహితురాలి ఇంటికి వెళ్లింది. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్ విధించ‌డంతో.. అక్క‌డే చిక్కుకుపోయింది. మంత్రి హరీశ్‌రావు చొర‌వ‌తో ఆ విద్యార్థినిని క్షేమంగా ఇంటికి చేరుకొంది. వివ‌రాల్లోకి వెళితే.. గజ్వేల్ కి చెందిన లింగంపల్లి స్వాతి రాజ‌స్థాన్‌లో చ‌దువుతోంది. మార్చి 16 న కాలేజీలు సెల‌వులు ఇవ్వ‌డంతో.. క‌డ‌ప జిల్లా రాయంపుట‌లోని స్నేహురాలి ఇంటికి వెళ్లింది. అదే స‌మ‌యంలో లాక్‌డౌన్‌ను ప్ర‌క‌టించ‌డంతో ఆ విద్యార్థిని అక్క‌డే ఉండాల్సి వ‌చ్చింది.

విద్యార్థిని త‌ల్లి మంత్రి హరీశ్‌రావుని క‌లిసి విష‌యం వివ‌రించింది. వెంట‌నే స్పందించిన మంత్రి ఏపీ అధికారుల‌తో మాట్లాడి.. స్వాతిని హైద‌రాబాద్ పంపే ఏర్పాట్లు చేయాల‌ని కోరారు. దీంతో ఆదివారం ప్ర‌త్యేక వాహానంలో స్వాతి హైద‌రాబాద్ చేరుకుంది. స్వాతికి కోవిడ్‌-19 ప‌రీక్ష‌లు నిర్వ‌హించిన అనంత‌రం విద్యార్థిని గ‌జ్వుల్ లోని ఇంటికి పంపించారు. ఈ సందర్భంగా స్వాతి, ఆమె కుటుంబ స‌భ్యులు నేడు మంత్రి హరీష్ రావు ని కలిసి కృతజ్ఞతలు తెలియ‌జేశారు.

Also Read

Next Story
Share it