బావిలో పడ్డ స్ట్రీట్ డాగ్ .. రక్షించిన డిఆర్ఎఫ్ బృందం

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  17 Oct 2019 10:59 AM GMT
బావిలో పడ్డ స్ట్రీట్ డాగ్ .. రక్షించిన డిఆర్ఎఫ్ బృందం

హైదరాబాద్‌: బావిలో పడి చావు బతుకుల్లో ఉన్న ఓ వీధి కుక్కను జీహెచ్‌ఎంసీ డిజాస్టర్ రెస్క్యూ సిబ్బంది రక్షించారు. వీధి కుక్కను కాపాడిన ఘటన యాప్రాల్‌లో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. యాప్రాల్‌లో పాడు పడిన బావి ఇటీవల వర్షాలకు పూర్తిగా నీటితో నిండిపోయింది. బావిలో మూడు రోజుల క్రితం ఒక వీధి కుక్క ప్రమాదవశాత్తు పడిపోయింది. ఇది గమనించిన స్థానికులు వీధికుక్కను రక్షించాల్సిందిగా జీహెచ్‌ఎంసీ డీఆర్ఎఫ్ బృందానికి సమాచారం అందించారు. వెంటనే సమీపంలోని డిజాస్టర్ రెస్క్యూ బృందం బుధవారం రాత్రి సంఘటనా స్థలానికి చేరుకుంది.

లోతుగా ఉండి నిరుపయోగంగా ఉన్నఆ బావిలో ఒక మూలకు ఉన్న కుక్కను సిబ్బంది గమనించారు. తమ వద్ద ఉన్న నిచ్చెన సహాయంతో బావిలోకి వెళ్లి పూర్తిగా నీరసించిన వీధికుక్కను డిఆర్ఎఫ్ బృందం సురక్షితంగా బయటికి తీసింది. గత రెండు రోజులుగా ఏ విధమైన ఆహారాన్ని తీసుకోకుండా పూర్తిగా నీరసించిన ఆ వీధికుక్కను వెటర్నరీ ఆస్పత్రికి తరలించారు. కేవలం ఒక ఫోన్ కాల్‌తో వెంటనే స్పందించి రాత్రివేళల్లోను వీధి కుక్కను రక్షించిన డిఆర్ఎఫ్ బృందాన్ని, మూగజీవాల పట్ల వారికున్న కారుణ్యాన్ని యాప్రాల్ వాసులు అభినందించారు.

Next Story