భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

By సుభాష్  Published on  13 March 2020 9:49 AM IST
భారీగా కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు

స్టాక్‌ మార్కెట్లు భారీగా కుప్పకూలాయి. కరోనా వైరస్‌ మార్కెట్లను సైతం బెంబేలెత్తిస్తున్నాయి. ఈ రోజు భారీ నష్టాలతో స్టాక్‌ మార్కెట్లు ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 3,100 పాయింట్లకుపైగా నష్టంతో, 950 పాయింట్లకుపైగా నష్టంతో నిప్టీ ట్రేడవుతుండగా, 45 నిమిషాల పాటు ట్రేడింగ్‌ను నిలిపివేశారు. మూడేళ్ల కనిష్టానికి నిప్టీ పడిపోయింది. రూపాయి విలువ రికార్డు స్థాయిలో పతనమైపోయింది.

నిన్న ఒక్కరోజే రూ.11లక్షల కోట్ల సొమ్ము అవిరైపోయింది. కరోనా, గ్లోబల్‌ మార్కెట్ల పతనంతో దేశీయ మార్కెట్లు కుప్పకూలాయి. నష్టాలకు భయపడి ఇన్వెస్టర్లు అమ్మకాల వైపు మొగ్గు చూపుతున్నారు.

Next Story