ఎస్బీఐ బిగ్‌న్యూస్‌: మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీల ఎత్తివేత

By సుభాష్  Published on  11 March 2020 1:06 PM GMT
ఎస్బీఐ బిగ్‌న్యూస్‌:  మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీల ఎత్తివేత

దేశంలో అతిపెద్ద బ్యాంక్‌ అయిన ఎస్బీఐ తాజాగా తన వినియోగదారులకు గుడ్‌ ‌న్యూస్‌ ప్రకటించింది. ప్రతినెల మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీలను ఎత్తివేసింది. ఇది సేవింగ్స్‌ బ్యాంక్‌ ఖాతాదారులకు వర్తించనుంది. ఈ నిర్ణయంతో కోట్లాది మంది వినియోగదారులకు ఊరట కలగనుంది. స్టేట్‌ బ్యాంక్‌ సేవింగ్స్‌ ఖాతాలపై ప్రతినెల మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీలు ఎత్తివేయడం వల్ల 44.51 కోట్ల మంది ఖాతాదారులకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఎస్బీఐ సేవింగ్‌ బ్యాంక్‌ కస్టమర్లు రూ. 1000 నుంచి రూ. 3వేల వరకు మినిమమ్‌ బ్యాలెన్స్‌ కలిగి ఉండాల్సి ఉండేది.

దీంతో చాలా మంది ఖాతాదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇక మెట్రో నగరాల్లో బ్యాంక్‌ ఖాతాలు కలిగిన కస్టమర్లకు మంత్లీ మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూ. 3 ఉండగా, అదే పట్టణాల్లో ఎస్బీఐ సేవింగ్స్‌ అకౌంట్లకు ప్రతినెల మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూ.2వేలు ఉంది. ఇక గ్రామీణ ప్రాంతాల్లోని ఖాతాదారులకు మినిమమ్‌ బ్యాలెన్స్‌ రూ.1000 ఉంది. ఒక వేళ సేవింగ్‌ అకౌంట్లో మినిమమ్‌ బ్యాలెన్స్‌ లేకపోతే రూ. 5 నుంచి రూ.15 వరకు పెనాల్టీ చార్జీలను విధించేవారు. అందులోజీఎస్టీ అదనం.

అంతేకాదు మినిమమ్‌ బ్యాలెన్స్‌ చార్జీలే కాదు ఎస్‌ఎంఎస్‌ చార్జీలను కూడా ఎత్తివేస్తున్నట్లు ప్రకటించింది. అలాగే సేవింగ్స్‌ బ్యాంక్‌ అకౌంట్లపై వడ్డీరేటును 3 శాతానికి సవరించింది.

Next Story