సచిన్, సెహ్వాగ్, కోహ్లీ.. అందరి రికార్డ్‌లను బద్దలు కొట్టిన స్మిత్..!
By న్యూస్‌మీటర్ తెలుగు Published on 30 Nov 2019 6:09 PM ISTఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్ రికార్డుల మీద రికార్డులు కొల్లగొడుతున్నాడు. పాకిస్థాన్‌తో జరుగుతున్న రెండో టెస్టులో స్మిత్ కేవలం 36 పరుగులకే పరిమితమైనా... సచిన్, సెహ్వాగ్ ల పేరిట ఉన్న రికార్డులను బద్దలుకొట్టాడు. టెస్టుల్లో అతి తక్కువ ఇన్నింగ్స్‌లలోనే 7వేల పరుగులు సాధించిన ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. స్మిత్ కేవలం 126 ఇన్నింగ్స్‌లలోనే ఈ ఘనత సాధించి సచిన్, సెహ్వాగ్‌లను వెనక్కి నెట్టేశాడు.
అంతకుముందు ఈ జాబితాలో ఇంగ్లండ్ బ్యాట్స్‌మన్ హేమండ్ (131), సెహ్వాగ్ (134), సచిన్ 136 ఇన్నింగ్స్‌లతో స్మిత్ తర్వాతి స్థానాల్లో ఉన్నారు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, శ్రీలంక మాజీ కెప్టెన్ సంగక్కర, విండీస్ ఆటగాడు గ్యారీలు 138 ఇన్నింగ్స్‌లలో 7వేల పరుగుల మైలురాయిని అందుకున్నారు.
మరోవైపు, ఆసీస్ లెజండరీ ఆటగాడు డాన్ బ్రాడ్‌మన్ పేరిట ఉన్న 7వేల పరుగుల రికార్డును సైతం స్మిత్ అధిగమించాడు. బ్రాడ్‌మన్ 52 టెస్టుల్లో 6,996 పరుగులు చేయగా, స్మిత్ 70 టెస్టుల్లో 7 వేల పరుగులు పూర్తిచేశాడు. బాల్ టాంపరింగ్ వివాదం కారణంగా కొద్ది కాలంపాటు క్రికెట్‌కు దూరమైన స్మిత్.. పునరాగమనం తర్వాత సత్తా చాటుతున్నాడు.