స్టీఫెన్ సన్ దిష్టిబొమ్మ దగ్ధం చేసిన క్రైస్తవులు..!

By న్యూస్‌మీటర్ తెలుగు  Published on  22 Sep 2019 7:40 AM GMT
స్టీఫెన్ సన్  దిష్టిబొమ్మ దగ్ధం చేసిన క్రైస్తవులు..!

సికింద్రాబాద్‌ : అసెంబ్లీలో క్రైస్తవుల పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసిన నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్‌సన్‌పై క్రైస్తవులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. సికింద్రాబాద్‌లో స్టీఫెన్‌సన్‌ దిష్టి బొమ్మను దగ్ధం చేశారు. సెయింట్ మేరీ దిష్టి బొమ్మ దగ్ధం చేసి తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. స్టీఫెన్‌సన్ తన వ్యాఖ్యలను తక్షణమే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాదు..క్రైస్తవులకు స్టీఫెన్‌సన్ క్షమామణ చెప్పాలన్నారు.

మరోవైపు..సెంట్ మేరీ చర్చి నుంచి ర్యాలీగా వెళ్లాలని ప్రయత్నించిన క్రైస్తవులను పోలీసులు అడ్డుకున్నారు. క్రైస్తవులకు, చర్చికి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేసిన స్టీపెన్సన్ సారీ చెప్పాలని నిరసనకారులు డిమాండ్ చేశారు.

Next Story