తెలంగాణ సచివాలయం కూల్చివేత అంశంపై కొనసాగుతున్న స్టేను ఈ నెల 15 వరకు పొడిగించింది రాష్ట్ర హైకోర్టు. భవనాల కూల్చివేత అనుమతులపై రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన కౌంటర్‌పై హైకోర్టు విచారణ చేపట్టింది. కేబినెట్ నిర్ణయాన్ని సీల్డ్ కవర్‌లో సమర్పించాలని ఆదేశించింది.