ఆ రాష్ట్రంలో కరోనా కేసులు సున్నా..
By సుభాష్ Published on 23 April 2020 9:34 PM ISTదేశ వ్యాప్తంగా కరోనా వైరస్ విజృంభిస్తోంది. రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఆ రాష్ట్రంలో మాత్రం కరోనా వచ్చిన రోగులంతా కోలుకుని కరోనా ఫ్రీగా మారిపోయింది. దేశ వ్యాప్తంగా రోజుకు వెయ్యికి పైగా కేసులు నమోదవుతుంటే, పదుల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి. దీంతో అన్ని రాష్ట్రాలకు కరోనా అంటే పెద్ద తలనొప్పిగా మారుతోంది. అయితే తక్కువ కేసులు నమోదైన చిన్న రాష్ట్రాలు సైతం కోలుకుంటున్నాయి.
ఇక తాజాగా కరోనా ఫ్రీ జాబితాలో త్రిపురా రాష్ట్రం చేరింది. ఈ రాష్ట్రంలో కరోనా బారిన పడిన ఇద్దరు రోగులు కోలుకుని డిశ్చార్జ్ అయినట్లు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి విప్లబ్ దేవ్ వెల్లడించారు. పలు పరీక్షల్లో వారికి నెగిటివ్ రావడంతో రెండో రోగిని కూడా గురువారం డిశ్చార్జ్ చేసినట్లు చెప్పారు. ప్రస్తుతం తమ రాష్ట్రం ఒక్క కరోనా కేసు కూడా లేదని ట్విట్టర్‌లో వెల్లడించారు. అయినప్పటికీ ప్రతీ ఒక్కరు కూడా సోషల్ డిస్టెన్స్ పాటించాల్సిందేనని, కేంద్రం మార్గదర్శకాలను పాటించాలని ఆయన తెలిపారు.