ముఖ్యాంశాలు

  • నిన్న‌రాత్రి హైద‌రాబాద్‌లో నిశ్చితార్థ వేడుక‌
  • 8న కాకినాడ‌లో వివాహం
  • 9న రిసెప్షన్

భార‌త‌ స్టార్ షట్లర్, అర్జున అవార్డు గ్రహీత భమిడిపాటి సాయి ప్రణీత్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నాడు. కాకినాడకు చెందిన శ్వేతతో త‌న జీవితాన్ని పంచుకోనున్నాడు. శ్వేత బెంగళూరులో సాఫ్ట్ వేర్ ఇంజినీర్‌గా పని చేస్తోంది. శుక్రవారం రాత్రి హైద‌రాబాద్‌లో సాయి, శ్వేతల నిశ్చితార్థ వేడుక‌ ఘనంగా జరిగింది.

సాయి ప్రణీత్ ది పెద్దలు కుదిర్చిన వీరి వివాహం. ఈ నిశ్చితార్థ‌ వేడుకకు పలువురు క్రీడాప్రముఖులు హాజరయ్యారు. స్టార్ ష‌ట్ల‌ర్లు కశ్యప్, సైనా దంపతులతో పాటు, అశ్వనీ పొన్నప్ప ఇతర బ్యాడ్మింటన్ క్రీడాకారులు హాజరయ్యారు. వీరి వివాహం వచ్చే నెల 8న కాకినాడలో జరగనుంది. అనంత‌రం హైదరాబాద్‌లో డిసెంబర్ 9న రిసెప్షన్ ఏర్పాటు చేస్తున్నట్టు స‌మాచారం.

సామ్రాట్ మేడి

మేడి. సామ్రాట్ .. నేను న్యూస్ మీట‌ర్ లో జ‌ర్న‌లిస్టుగా ప‌నిచేస్తున్నాను. గ‌తంలో ఆంధ్ర‌ప్ర‌భ‌, భార‌త్ టుడే, న్యూస్ హ‌బ్, ఏపీ హెరాల్డ్ ల‌లో 3 సంవ‌త్స‌రాల పాటు ప‌నిచేశాను. జ‌ర్న‌లిజం ప‌ట్ల ఇష్టంతో నేను ఈ వృత్తిని ఎంచుకున్నాను.