పీవీ సింధుకు అనుకోని అదృష్టం.. వరుసగా మూడేళ్ల పాటు..

By తోట‌ వంశీ కుమార్‌  Published on  5 April 2020 7:18 AM GMT
పీవీ సింధుకు అనుకోని అదృష్టం.. వరుసగా మూడేళ్ల పాటు..

ప్రముఖ బ్యాడ్మింటన్‌ స్టార్‌ పీవీ సింధు అనుకోని అదృష్టం కలిసి వచ్చింది. ఇలా జరుగుతుందని బహుశా.. ఇలా కలిసి వస్తుందని పీవీ సింధు కూడా ఊహించి ఉండదేమో. వరుసగా మూడేళ్లు ఆమె ప్రపంచ చాంపియన్‌. డబ్ల్యూబీఎఫ్‌(బ్యాడ్మింటన్‌ సమాఖ్య) 2006 నుంచి ప్రతి సంవత్సరం వరల్డ్‌ చాంఫియన్‌ షిప్‌ నిర్వహిస్తోంది. 2019లో నిర్వహించిన వరల్డ్‌ చాంపియన్‌ షిప్‌లో భారత స్టార్‌ పీవీ సింధు విజయం సాధించింది. 2020 వరకే ఆహోదా. అయితే.. ఒలింపిక్స్‌ నిర్వహించే ఏడాదిలో వరల్డ్‌ చాంఫియన్‌ షిప్‌ నిర్వహించరు. ఈ ఏడాది జులైలో ఒలింపిక్స్‌ ఉండడంతో ఈ ఏడాది చాంపియన్‌ షిప్‌ లేదు. అయితే.. కరోనా ముప్పుతో ఒలింపిక్స్‌ను వచ్చే ఏడాదికి వాయిదా పడిన సంగతి తెలిసిందే. దాంతో వచ్చే ఏడాది కూడా ప్రపంచ చాంపియన్‌ షిప్‌ను నిర్వహించే అవకాశం లేదు. దాంతో ఈ మూడేళ్ల పాటు సింధునే వరల్డ్‌ టైటిట్‌ అని బ్యాడ్మింటన్‌ వర్గాలు చెబుతున్నాయి.

కాగా.. వరల్డ్‌ చాంపియన్‌గా ఏకంగా మూడేళ్ల పాటు కొనసాగడం పై సింధు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. ఈ విషయం పై సింధు మాట్లాడుతూ.. టోర్నీలు తిరిగి ఎప్పుడు ప్రారంభమవుతాయనే దానిపైనే ప్రస్తుతం మా దృష్టి ఉందని చెప్పింది. వరల్డ్‌ చాంపియన్‌షిప్‌, ఒలింపిక్స్‌ వాయిదా పడడం పై చర్చ జరుగుతోందని తెలిపింది.

ఇదిలా ఉంటే.. ఆల్‌ఇంగ్లాండ్‌ టోర్నీలో పాల్గొని గత నెల 14న స్వదేశానికి వచ్చిన సింధు 14 రోజుల పాటు సెల్ఫ్‌ క్వారంటైన్‌లో ఉంది. ఆ నిర్భందం మార్చి 28ప ముగిసినా.. విదేశాల నుంచి రావడంతో.. దానిని ఈ నెల 5 వరకు పొడిగించారు. స్థానిక పోలీసులు మమ్మల్ని పర్యవేక్షిస్తున్నారు. క్వారంటైన్‌ను ఈనెల 5 వరకు పొడిగించారు. మా పాస్‌పోర్టులు స్వాధీనం చేసుకున్నారు. ఇంటికి స్టిక్కర్‌ అతికించారు. ఇంగ్లాండ్‌ నుంచి వచ్చిన స్నేహితులను అడగగా.. వారికి కూడా ఇలానే చేశారని చెప్పారు.

Next Story