ఇళ్లల్లోనే స్టార్స్.. మేకప్ లేకుండా చూశారా..?

By అంజి  Published on  4 April 2020 4:18 PM GMT
ఇళ్లల్లోనే స్టార్స్.. మేకప్ లేకుండా చూశారా..?

దేశవ్యాప్తంగా లాక్ డౌన్ అమలులో ఉంది. లాక్ డౌన్ ప్రభావం సినిమా ఇండస్ట్రీ మీద భారీగా పడింది. సినిమాల విడుదల లేవు.. షూటింగ్ లు అసలే లేవు..! దీంతో స్టార్స్ అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. షూటింగ్ లు లేకపోవడంతో స్టార్స్ అందరూ మేకప్ కు దూరంగా ఉన్నారు.

Star heroines without makeup

లాక్ డౌన్ ముగియడానికి చాలా తక్కువ సమయమే ఉండడంతో ఎప్పటికప్పుడు ఇళ్లల్లో తమకు తోచిన పని చేసుకుంటూ ఉన్నారు. తమ ఫాలోవర్స్ ను లైవ్ లో ఎంటర్టైన్ చేసే స్టార్స్ కొందరైతే.. ఫిట్ గా ఉండాలంటూ వారి వర్కౌట్లను చూపించే వాళ్ళు ఇంకొందరు.. తమ పెంపుడు జంతువులతో ఆడుకునే వారు మరికొందరు. తమ ఇళ్లల్లో పనులు చేసుకుంటూ.. తోట పని చేసుకుంటూ.. కుటుంబసభ్యులతో ఎక్కువ సమయం కేటాయిస్తూ ఉన్నారు.

Star heroines without makeup

ఇక షూటింగ్ లకు దూరమైన హీరోయిన్లు మేకప్ లేకుండా తాము ఎలా ఉంటామో తమ ఫాలోవర్లతో షేర్ చేసుకుంటూ ఉన్నారు. సోషల్ మీడియాలో బాలీవుడ్ భామలు అలా సందడి చేస్తూ ఉన్నారు.కరీనా కపూర్ ఖాన్, కత్రినా కైఫ్, శ్రద్ధా కపూర్, అనుష్క శర్మ, ఆలియా భట్, దీపిక పదుకోన్ ఇలా ప్రతి ఒక్కరూ తమ డీ-గ్లామర్ లుక్స్ ను బయటపెట్టారు. దీపిక పదుకోన్ మేకప్ లేకుండా పుచ్చకాయ తింటున్నప్పుడు ఉన్న లుక్స్, కరీనా కపూర్ ఎండలో సేదతీరుతున్న ఫోటోలు.. వారు మేకప్ లేకుండా ఎలా ఉంటారా అన్న క్లారిటీని మనకు ఇచ్చాయి. కత్రీనా కైఫ్ కూడా మేకప్ లేకుండా ఇంట్లో పని చేసుకుంటూ ఉన్న వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మిగిలిన స్టార్స్ కూడా తమ ఒరిజినల్ స్కిన్ టోన్ ను హ్యాపీగా అందరికీ తెలిసేలా చేశారు.

Next Story
Share it