శ్రీశైలం: ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం క్రమంగా పెరుగుతోంది. ఒక గేటును పైకెత్తి సాగర్‌కు 27వేల 983 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. ఈ సీజన్‌లో శ్రీశైలం గేట్లు ఎత్తడం ఇది మూడో సారి. శ్రీశైలానికి 1,00,152 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వస్తుండగా.. 1,05,691 క్యూసెక్కుల ఔట్‌ఫ్లో నమోదవుతోంది. కుడిగట్టు విద్యుత్‌ కేంద్రం ద్వారా 25,904 క్యూసెక్కులు, కల్వకుర్తి ఎత్తిపోతల పథకానికి 2,400 క్యూసెక్కులు, హంద్రీ – నీవా ద్వారా 2, 026 క్యూసెక్కులు, పోతిరెడ్డిపాడు హెడ్‌రెగ్యులేటరీ ద్వారా 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు.

న్యూస్‌మీటర్ తెలుగు

విశ్వసనీయమైన డిజిటల్ మీడియా ప్లాట్‌ఫారమ్ మీకు విశ్వసనీయ వార్తా కథనాలను మరియు ప్రస్తుత వ్యవహారాల విశ్లేషణను తెస్తుంది.