అమృతపై శ్రీరెడ్డి కామెంట్స్.. నెటిజన్ల స్పందనతో డిలీట్ చేసి మళ్లీ..

By రాణి  Published on  10 March 2020 11:38 AM GMT
అమృతపై శ్రీరెడ్డి కామెంట్స్.. నెటిజన్ల స్పందనతో డిలీట్ చేసి మళ్లీ..

తెలుగు రాష్ర్టాల్లో మళ్లీ సెన్సేషనల్ టాపిక్ అయింది అమృతా ప్రణయ్. 2018లో ప్రణయ్ హత్యతో సుమారు నెలరోజుల పాటు వార్తల్లోకెక్కిన అమృత గురించి జనాలు మళ్లీ మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. మీడియా కూడా మూడ్రోజులుగా టీఆర్ పీ కోసం అమృత గురించి, ఆమె తండ్రి మారుతీ రావు ఆత్మహత్య, అమృత అభిప్రాయం, మారుతీరావు ఆస్తుల వివరాలు, అమృతపై శ్రవణ్ ఆరోపణలు, ప్రణయ్ హత్యకేసు ఛార్జీషీట్..ఇలా రకరకాలుగా వార్తలు వేస్తూనే ఉంది. కొందరు చిన్న వయసులోనే భర్తను పోగొట్టుకున్న అమృత..ఇప్పుడు తండ్రిని కూడా కోల్పోయిందని జాలి చూపిస్తుంటే..మరికొందరు రెండు జీవితాలు అర్థంతరంగా ముగియడానికి..ఒక జీవి తండ్రి లేకుండా లోకంలోకి రావడానికి కారణం అమృతే నంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కులం, పరువు కోసం మారుతీరావు చేసింది సబబేనని మరికొందరు మద్దతు తెలుపుతున్నారు.

Also Read : వాళ్లు అన్నంత పనీ చేశారు : ప్రణయ్ తండ్రి బాలస్వామి

తాజాగా శ్రీరెడ్డి అమృత గురించి సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. తన ఫేస్ బుక్ పేజ్ లో అమృతనుద్దేశించి ''నిన్ను చూస్తే..సిగ్గుగా ఉంది'' అని కామెంట్ చేయగా..నెటిజన్లు నిమిషాల్లోనే శ్రీరెడ్డి పోస్ట్ పై విమర్శలు చేయడం మొదలుపెట్టారు. దీంతో వెంటనే ఆ పోస్ట్ ను డిలీట్ చేసేసి.. ‘అమృత.. నీ బాధను అర్థం చేసుకున్నా. రియలైజ్ అయ్యా. క్షమించు. నువ్వు చాలా పోగొట్టుకున్నావు. దేవుడు నిన్ను, నీ బిడ్డను దీవించాలి’ అని మరొక పోస్ట్ పెట్టింది శ్రీరెడ్డి. ఈ పోస్ట్ పై కూడా నెటిజన్లు అమృతకు మద్దతిచ్చినా..కొంతమంది మాత్రం ఆమె చేసింది తప్పేనంటున్నారు.

Also Read : ముదిరిన సెల్ఫీ పిచ్చి..పెదనాన్నను చంపి సెల్ఫీ

ఒక నెటిజన్ అయితే.. ‘శ్రీరెడ్డి, మీరు దీనికన్నా ముందు పెట్టిన పోస్ట్ నేను చూశాను. అందులో మీరు అమృతను తిడుతూ రాశారు. తోటి మహిళగా ఆలోచించకుండా అమృత మీద విషం చిమ్మావు. ఆమెపై అంత దుర్మార్గంగా ఎలా కామెంట్స్ చేయగలిగావు. కులవివక్షతతో ప్రణయ్ ను చంపించింది మారుతీరావు అయితే..అమృత ఏం చేసిందని తిట్టావు ? కూతురు కష్టాల్లో ఉంటే తండ్రి ఏదోలా ఆమె చేరదీయాల్సింది పోయి..పిరికివాడిలా ఆత్మహత్య చేసుకోవడం సరికాదు. అందుకు అమృత బాధ్యురాలు కాదు. ఒక మనిషిగా నీకూ మానవత్వ భావన ఉండాలి.’ అని ఘాటుగా స్పందించారు.

Sri Reddy Face Book Page

Next Story