జడ్జి అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇదే..

By సుభాష్  Published on  6 Feb 2020 2:14 PM GMT
జడ్జి అడిగిన ప్రశ్నలకు శ్రీనివాస్‌రెడ్డి సమాధానం ఇదే..

తెలంగాణలో సంచలన సృష్టించిన హాజీపూర్‌ హత్య కేసులో నల్గొండ ఫోక్సో కోర్టు గురువారం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన శ్రీనివాస్‌రెడ్డికి ఉరిశిక్ష ఖారారు చేస్తూ తీర్పునిచ్చింది.

ఓ కేసులో జీవిత ఖైదు

శ్రీనివాస్‌రెడ్డిపై నమోదైన మూడు కేసుల్లోనూ జడ్జి తీర్పునిచ్చారు. మూడు కేసుల్లో కూడా నేరం రుజువైనందున ఉరిశిక్షను అమలు చేస్తున్నట్లు చెప్పారు. ఒక కేసులో హత్యా నేరం కింద జీవిత ఖైదు విధించగా, ఇక మరో రెండు కేసుల్లో ఉరిశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. ఈ సందర్భంగా ఓ న్యాయవాది మాట్లాడుతూ.. ఈశిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని కోర్టు ఆదేశించిందని, తీర్పు రికార్డునంతా హైకోర్టుకు పంపుతామని తెలిపారు. ఉన్నత న్యాయస్థానం అప్రూవ్‌ చేశాక అమలవుతుందన్నారు. కాగా, నిందితుడు అప్పీలుకు వెళ్లేందుకు అవకాశం కల్పించింది.

కోర్టులో కన్నీరు పెట్టుకున్ననిందితుడు

కేసులో నిందితుడిగా ఉన్న శ్రీనివాస్‌ రెడ్డిని గురువారం కోర్టులో ప్రవేశపెట్టారు. ఇప్పటికే నేరం రుజువైంది.. శిక్ష గురించి ఏమైనా చెప్పుకుంటావా..? అని జడ్జి అడుగగా, నాకు ఈ హత్యలతో ఏమాత్రం సంబంధం లేదు.. అనవసరంగా నా ఇల్లును తగులబెట్టారు.. నా భూములను లాగేసుకున్నారు.. అంటూ శ్రీనివాస్‌రెడ్డి జడ్జి ముందు రోధించాడు. ఇక మూడు కేసుల్లోనూ నేరం రుజువైందని, 11 ఏళ్ల బాలికను ముక్కు మూసి హత్య చేసినట్లు తేలిందని జడ్జి అడగగా, మళ్లీ కూడా తనకు సంబంధం లేదన్నట్లు చెప్పుకొచ్చాడు. నా తల్లిదండ్రులకు ఎలాంటి ఆధారం లేదు.. వారికి నేనే అంటూ రోధించాడు. జడ్జి ఏ విషయం గురించి అడిగినా.. తనకు తెలియదు అంటూ సమాధానం చెప్పుకొచ్చాడు శ్రీనివాస్‌ రెడ్డి.

Next Story
Share it