బతుకు బలైపోయిన బండి..శ్రీముఖి కొత్త అవతారం

By రాణి  Published on  15 April 2020 11:54 AM IST
బతుకు బలైపోయిన బండి..శ్రీముఖి కొత్త అవతారం

  • కరోనా వల్ల కూలిపోతున్న కాపురాలను చక్కదిద్దుతున్న శ్రీముఖి

నా పేరు మందారం..నా షోకి వచ్చిన వారికి నేనే ఆధారం అంటూ ప్రముఖ యాంకర్, నటి శ్రీముఖి కొత్త అవతారమెత్తింది. కరోనా కల్లోలం కారణంగా ఏర్పడిన లాక్ డౌన్ తో చాలా మంది బోర్ గా ఫీల్ అవుతున్నారు. సినిమా, సీరియల్, రియాలిటీ షోలు చేసే వారుసైతం ఇళ్లకే పరిమితమవ్వడంతో టీవీలో కూడా కొత్త ఎంటర్టైన్ మెంట్ ప్రోగ్రామ్స్ ఆగిపోయాయి. దీంతో శ్రీముఖి ఒక స్ఫూఫ్ వీడియో మొదలుపెట్టింది. కరోనా వల్ల ప్రపంచ వ్యాప్తంగా మరణాలు సంభవిస్తున్నాయన్న విషయం మీకు తెలుసు కానీ..అదే కరోనా వల్ల కాపురాలు కూడా కూలిపోతున్నాయని మీకు తెలుసా అంటూ బతుకు బలైపోయిన బండి పేరుతో స్పూఫ్ వీడియో చేసింది. ఈ వీడియోలో అవినాష్, విష్ణుప్రియ లు భార్యాభర్తలుగా కనిపించగా..లాక్ డౌన్ వల్ల వారి కాపురంలో తలెత్తిన సమస్యలను తీర్చే పెద్దమనిషిగా శ్రీముఖి కనిపిస్తుంది.

Also Read : హిందువుల మనోభావాలు దెబ్బతినేలా కరోనా వార్తలు..ప్రముఖ ఛానెల్ పై కేసు

లాక్ డౌన్ రోజుల్లో ఇంట్లోనే ఉన్న భార్య భర్తలు కొట్టుకోకుండా..కలిసి మెలిసి ఉంటూ..చెరో పని పంచుకుంటూ చేసుకుంటే ఎలాంటి తగాదాలు రావన్న మెసేజ్ ఇచ్చేందుకే ఈ వీడియో రూపొందించారు. ఈ ముగ్గురు ఎవరి ఇళ్లల్లో వారుండి టెక్నాలజీతో వీడియో చేశారు. ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతోన్న ఈ వీడియోని మీరూ ఓ లుక్కేయండి.

Next Story