ఆన్ స్ర్కీన్..శ్రీదేవి కూతురి పెళ్లి..

By రాణి  Published on  19 March 2020 7:05 PM IST
ఆన్ స్ర్కీన్..శ్రీదేవి కూతురి పెళ్లి..

అలనాటి అందాల తార శ్రీదేవి ఆన్ స్ర్కీన్ కూతురి పెళ్లి దుబాయ్ లోని అబుదాబీలో అంగరంగ వైభవంగా జరిగింది. కరోనా కారణంగా అతిథులు తక్కువ సంఖ్యలో హాజరవ్వగా..కుటుంబ సభ్యుల ఆధ్వర్యంలో వీరిద్దరి పెళ్లి ఘనంగా జరిగింది. అదేంటి శ్రీదేవి కూతురు అలా ఎలా పెళ్లి చేసుకుంటుంది. ఎవరికీ చెప్పా చేయకుండా..అలా చేసుకోవడం ఏంటి అనుకుంటున్నారా ? ఇక్కడే పప్పులో కాలేశారు. ఆన్ స్ర్కీన్ కూతురి పెళ్లి అన్నాం గానీ..జాన్వీ కపూర్, ఖుషీ కపూర్ పెళ్లి అనలేదు కదా.

Pakisthani Actress Sajal Marriage

వీరిద్దరితో పాటు శ్రీదేవి మరో కూతురుంది. ఆమే సెజల్. మామ్ సినిమాలో శ్రీదేవికి కూతురిగా నటించింది సెజల్. ప్రస్తుతం పాకిస్థాన్ లో ఉన్న బిగ్గెస్ట్ స్టార్స్ లో సెజల్ కూడా ఒకరు. ఈమె తన తోటి నటుడు అహద్ రాజాను పెళ్లి చేసుకుంది. దుబాయ్ లో వీరి వివాహం ఘనంగా జరిగింది. ఈ వివాహ వేడుకకు మహిరా ఖాన్, ఫహాద్ ఖాన్, మౌరా ఓసినీ లాంటి పాకిస్థానీ సినిమా స్టార్స్ హాజరయ్యారు.

Also Read : ఫేక్ వార్తలను నియంత్రించే దిశగా వాట్సాప్ చర్యలు..

Next Story