చిత్తూరు: తిరులమ శ్రీవారిని నైవేద్యవిరామంలో శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఆయన పాల్గొన్నారు. స్వామివారి దర్శనాంతరం శ్రీలంక ప్రధాని రాజపక్సేకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణలు పలికారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.

Sri lanka PM Rajapaksa 1 Sri lanka PM Rajapaksa 3

శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని రాజపక్సే తిరుపతి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రాజపక్సేకు ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గన భారీ భద్రత మధ్‌య తిరుమల చేరుకున్నారు.

PM Rajapaksa 4 PM Rajapaksa 7 Sri lanka 8

అంజి

నేను గోనె అంజి. న్యూస్‌ మీటర్‌ తెలుగులో సబ్‌ ఎడిటర్‌గా విధులు నిర్వర్తిస్తున్నాను. గతంలో 99టీవీ, మోజో టీవీ, ఐ న్యూస్‌, ప్రైమ్‌ 9 న్యూస్‌ ఛానెళ్లలో న్యూస్‌ కాపీ ఎడిటర్‌గా పని చేశాను. జర్నలిజం పట్ల ఇష్టంతో ఈ వృత్తిని ఎంచుకున్నాను. 2018లో బ్యాచ్‌లర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ జర్నలిజంలో డిగ్రీ పట్టా పొందాను.

Next Story