శ్రీవారిని దర్శించుకున్న శ్రీలంక ప్రధాని
By అంజి Published on 11 Feb 2020 10:09 AM ISTచిత్తూరు: తిరులమ శ్రీవారిని నైవేద్యవిరామంలో శ్రీలంక ప్రధాని మహేంద్ర రాజపక్సే దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారి అష్టదళ పాద పద్మారాధన సేవలో ఆయన పాల్గొన్నారు. స్వామివారి దర్శనాంతరం శ్రీలంక ప్రధాని రాజపక్సేకు ఆలయ అర్చకులు వేదమంత్రోచ్చరణలు పలికారు. ఆలయ అధికారులు స్వామి వారి తీర్థ ప్రసాదాలను ఆయనకు అందజేశారు.
శ్రీలంక నుంచి ప్రత్యేక విమానంలో ప్రధాని రాజపక్సే తిరుపతి ఎయిర్‌పోర్టుకు వచ్చారు. రాజపక్సేకు ఏపీ రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు పలువురు, ప్రజా ప్రతినిధులు, అధికారులు స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గన భారీ భద్రత మధ్‌య తిరుమల చేరుకున్నారు.
Next Story