ఖేల్‌రత్న అవార్డు రేసులో హిమదాస్‌

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Jun 2020 4:20 PM IST
ఖేల్‌రత్న అవార్డు రేసులో హిమదాస్‌

భారత అగ్రశేణి స్ప్రింటర్‌ హిమదాస్‌ ప్రతిష్మాత్మక రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు బరిలో నిలించింది. క్రీడల్లో అత్యున్నత పురస్కారమైన ఖేల్‌రత్న కోసం 20 ఏళ్ల హిమదాస్‌ పేరును కేంద్ర క్రీడశాఖకు అస్సాం ప్రభుత్వం సిఫారసు చేసింది. దీంతో ఈ ఏడాది అవార్డు బరిలో నిలిచిన పిన్న వయస్కురాలిగా నిలిచింది. 2018లో అండర్‌-20 ప్రపంచ చాంఫియన్‌ షిప్స్‌ మహిళల 400మీ. పరుగులో స్వర్ణం గెలిచిన హిమ అంతర్జాతీయ స్థాయిలో ఏ పోటీల్లోనైనా అగ్రస్థానం సాధించిన తొలి భారత అథ్లెట్‌గా చరిత్ర సృష్టించింది.

ఆ తర్వాత జకార్తాలో జరిగిన ఆసియా క్రీడల 4×400 మిక్స్‌డ్‌, మహిళల 4×400మీ. రిలేల్లో ఆమె బంగారు పతకాలు సొంతం చేసుకుంది. ఈ క్రమంలోనే ఆమెకు 2018లో అర్జున అవార్డు దక్కింది. అయితే ఈసారి మాత్రం ఖేల్‌రత్న పురస్కారం కోసం ఆమె, జావెలిన్‌ త్రో అథ్లెట్‌ నీరజ్‌ చోప్రా, రెజ్లర్‌ వినేశ్‌ ఫొగాట్‌, టీటీ క్రీడాకారిణి మనిక బత్రా, మహిళల హాకీ కెప్టెన్‌ రాణి రాంపాల్‌, టీమిండియా ఓపెనర్‌ రోహిత్‌ శర్మతో పోటీపడనుంది.

Next Story