అంతర్జాతీయ క్రికెట్‌లో చెత్త రికార్డు, టైమ్‌ ఔట్‌ అయిన శ్రీలంక ప్లేయర్

శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా 25వ ఓవర్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది.

By Srikanth Gundamalla  Published on  6 Nov 2023 5:36 PM IST
world cup-2023, worst record,  international cricket,

అంతర్జాతీయ క్రికెట్‌లో చెత్త రికార్డు, టైమ్‌ ఔట్‌ అయిన శ్రీలంక ప్లేయర్  

భారత్ వేదికగా వన్డే వరల్డ్‌ కప్-2023 టోర్నీ జరుగుతోంది. ఇప్పటికే దాదాపుగా సెమీస్‌ బెర్త్‌లు ఖరారు అయిపోయాయి. అయితే.. ఢిల్లీ వేదికగా శ్రీలంక, బంగ్లాదేశ్‌ మధ్య మ్యాజ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో ఒక చెత్త రికార్డు నమోదు అయ్యింది. శ్రీలంక వెటరన్‌ ప్లేయర్‌ ఏంజెలో మ్యాథ్యూస్‌ అనూహ్య రీతిలో ఔట్‌ అయ్యాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో ఎన్నడూ లేని విధంగా టైట్‌ అవుట్‌ అయిన తొలి ప్లేయర్‌గా నిలిచాడు. చెత్త రికార్డును నమోదు చేసుకున్నాడు. నిర్ణీత సమయంలోగా క్రీజులోకి రాకపోవడంతో మ్యాథ్యూస్‌ను టైమ్‌ ఔట్‌గా ఎంపైర్లు ప్రకటించారు.

శ్రీలంక ఇన్నింగ్స్ సందర్భంగా 25వ ఓవర్‌లో ఈ చెత్త రికార్డు నమోదైంది. షకీబ్‌ ఉల్‌ హసన్‌ వేసిన ఓవర్‌లో రెండో బంతికి సమరవిక్రమ ఔట్‌అయ్యాడు. మహ్మదుల్లాకు క్యాచ్‌ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. అయితే.. 134 పరుగుల వద్ద ఈ వికెట్ పడింది. దాంతో.. వెటరన్ ఆల్‌రౌండర్‌ ఏంజెలో మ్యాథ్యూస్‌ బ్యాటింగ్‌కు రావాల్సి ఉంది. కానీ.. అతను క్రీజులోకి వచ్చేందుకు చాలా ఎక్కువ సమయమే తీసుకున్నాడు. హెల్మెట్ సరిగ్గా లేకపోవడంతో మ్యాథ్యూస్‌ క్రీజులోకి వచ్చేందుకు లేట్ అయ్యింది. దీనిపైన బంగ్లాదేశ్‌ ఆటగాళ్లు అప్పీల్‌ చేయడంతో.. మ్యాథ్యూస్‌ టైమ్‌ అవుట్‌ అయినట్లు అంపైర్లు ప్రకటించారు. దాంతో.. శ్రీలంక ఆటగాడు మ్యాథ్యూస్‌ చెత్త రికార్డును మూటగట్టుకున్నాడు.

కాగా.. వికెట్‌ పడిన వెంటనే రెండు నిమిషాల్లోపు తర్వాతి బ్యాటర్‌ క్రీజులో ఉండాలని ఎంసీసీ రూల్స్‌ చెబుతున్నాయి. అయితే సమరవిక్రమ వికెట్ పడిన తర్వాత మ్యాథ్యూస్ తీరిగ్గా గ్రౌండ్లోకి వచ్చాడు. వచ్చేటప్పుడే కాస్త పగిలిన హెల్మెట్ తీసుకుని రావటంతో హెల్మెట్ సమస్య తలెత్తింది. దీంతో మరో హెల్మెట్ తీసుకురావాల్సిందిగా తోటి ప్లేయర్‌ను కోరిన మ్యాథ్యూస్.. క్రీజులోకి రాకుండా అక్కడే ఆగిపోయాడు. శ్రీలంక సబ్‌స్టిట్యూట్ ఆటగాడు మ్యాథ్యూస్ కోసం మరో హెల్మెట్ తీసుకుని వచ్చేలోపే మూడు నిమిషాలు సమయం పట్టింది. దాంతో.. బంగ్లాదేశ్‌ ఆటగాళ్ల అప్పీల్‌తో అతడిని అంపైర్లు టైమ్‌ ఔట్‌గా ప్రకటించారు.

Next Story