ODI World Cup-23: తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్

వన్డే వరల్డ్‌ కప్‌లో తొలి మ్యాచ్‌కు ముందు టీమిండియాకు బిగ్‌షాక్‌ తగిలింది.

By Srikanth Gundamalla  Published on  6 Oct 2023 10:34 AM IST
World Cup-2023, Shubman gill, dengue, Teamindia,

 ODI World Cup-23: తొలి మ్యాచ్‌కు ముందు భారత్‌కు షాక్

వన్డే వరల్డ్‌ కప్‌-2023 టోర్నీ ప్రారంభం అయ్యింది. గురువారం న్యూజిలాండ్, ఇంగ్లాండ్ మధ్య తొలిమ్యాచ్‌ జరిగింది. డిఫెండింగ్‌ ఛాంపియన్స్‌ ఇంగ్లండ్‌ ఘోర ఓటమితో ఆరంభించింది. అహ్మదాబాద్‌ వేదికగా న్యూజిలాండ్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో ఏకంగా 9 వికెట్ల తేడాతో ఇంగ్లండ్‌ పరాజయం పాలైంది. 283 పరుగుల లక్ష్యాన్ని కేవలం ఒక్క వికెట్‌ కోల్పోయి 36.2 ఓవర్లలోనే న్యూజిలాండ్ ఛేదించింది. అయితే.. అక్టోబర్‌ 8న భారత్‌ తొలి మ్యాచ్‌ ఆస్ట్రేలియాతో ఆడనుంది. ఈ నేపథ్యంలో భారత్‌కు గట్టి షాక్‌ తగిలింది.

వన్డే వరల్డ్‌ కప్‌-2023లో భాగంగా టీమిండియా తొలి మ్యాచ్‌లో చెన్నై వేదికగా ఆస్ట్రేలియాతో తలపడనుంది. ఈ మ్యాచ్‌కు ముందు భారత్‌కు బిగ్‌ షాక్‌ తగిలింది. ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగి మూడు వన్డేల టోర్నీలో భారత స్టార్‌ బ్యాటర్‌ శుభ్‌మన్‌ గిల్‌ అద్భుతంగా రాణించిన విషయం తెలిసిందే. భారీ ఓపెనింగ్స్‌లో కీలకంగా వ్యవహరించాడు గిల్. అయితే.. ఇప్పుడు గిల్‌ తొలి మ్యాచ్‌కు దూరమవుతాడని తెలుస్తోంది. గిల్‌ డెంగ్యూతో బాధపడుతున్నట్లు సమాచారం అందుతోంది. డెంగ్యూ పాజిటివ్‌ తేలిటనట్లు పలు రిపోర్టులు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు శుభ్‌మన్‌ గిల్‌ దూరమయ్యే అవకాశాలు ఉన్నాయి.

శుభ్‌మన్‌ గిల్‌ ప్రస్తుతం బీసీసీఐ వైద్య బృందం పర్యవేక్షణలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. శుభ్‌మన్‌ గిల్‌కు శుక్రవారం మరోసారి రక్త పరీక్షలు నిర్వహించనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో వచ్చేఫలితాన్ని బట్టి జట్టు మేనేజ్‌మెంట్‌ నిర్ణయం తీసుకోనుంది. కాగా.. గిల్‌ ప్రస్తుం అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. ఓపెనర్‌గా రోహిత్‌తో పాటు దిగితే మంచి ఆరంభం దొరుకుతుందని.. ఫలితంగా టీమిండియా భారీ స్కోరుని సాధిస్తుందని అభిమానులంతా భావించారు. కానీ.. శుభ్‌మన్‌ గిల్‌కు డెంగ్యూ పాజిటివ్‌ వచ్చిందని వార్తలు వినిపిస్తుండటంతో టీమిండియా అభిమానుల్లో కాస్త ఆందోళన నెలకొంది. శుభ్‌మన్‌ గిల్‌ ఇటీవల జరిగిన ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌లో అదరగొట్టాడు. ఒకవేళ నిజంగానే శుభ్‌మన్‌ గిల్‌ ఆస్ట్రేలియాతో తొలిమ్యాచ్‌కు దూరం అయ్యితే టీమిండియాకు ఎదురుదెబ్బ అనే చెప్పాలి.

Next Story