వెస్టిండీస్‌ క్రికెటర్‌ నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు

వెస్టిండీస్‌ క్రికెటర్‌ నికోలస్ పూరన్ గురించి అందరికీ తెలుసు.

By Srikanth Gundamalla  Published on  28 Sept 2024 8:00 PM IST
వెస్టిండీస్‌ క్రికెటర్‌ నికోలస్ పూరన్ వరల్డ్ రికార్డు

వెస్టిండీస్‌ క్రికెటర్‌ నికోలస్ పూరన్ గురించి అందరికీ తెలుసు. అతను మంచి ఆటగాడు. ఈ స్టార్‌ ఆటగాడు అద్బుతమైన ఫామ్‌ను కొనసాగిస్తున్నాడు. ప్రస్తుతం ఇతను కరేబియన్ ప్రీమియర్ లీగ్‌ 2024లో ట్రిన్‌బాగో నైట్‌ రైడర్స్‌ తరఫున ఆడుతున్నాడు. ఈ క్రమంలోనే నికోలస్ పూరన్ అరుదైన రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు.

నికోలస్ పూరన్ టీ20ల్లో ఒక క్యాలెండర్ ఇయర్‌లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా వ‌ర‌ల్డ్ రికార్డు సృష్టించాడు. శనివారం సీపీఎల్‌లో భాగంగా బార్బడోస్ రాయల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో నికోలస్ పూరన్ 28 పరుగులు చేశాడు. దాని తర్వాత పూరన్ ఈ ఫీట్‌ను తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ ఏడాది టీ20ల్లో నికోలస్‌ ఇప్పటి దాకా 65 ఇన్నింగ్స్ ఆడాడు. ఇందులో 42.02 సగటుతో 2,059 పరుగులు చేశాడు. 14 హాఫ్ సెంచరీలు ఉండడం విశేషం. ఇంతకుముందు ఈ రికార్డు పాకిస్తాన్ స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ పేరిట ఉండేది. దాన్ని బ్రేక్‌ చేశాడు ఈ వెస్టిండీస్ ప్లేయర్ నికోలస్ పూరన్.

అంతకుముందు 2021 ఏడాదిలో 45 టీ20 ఇన్నింగ్స్‌లు ఆడిన నికోలస్ పూరన్ 2,036 పరుగులు చేశాడు. తాజా మ్యాచ్‌తో రిజ్వాన్ ఆల్‌టైమ్ రి​కార్డును ఈ కరేబియన్ విధ్వంసకర వీరుడు బ్రేక్ చేశాడు. ఈ ఏడాదిలో టీ20ల్లో వెస్టిండీస్‌, డర్బన్ సూపర్ జెయింట్స్, లఖ్‌నవూ సూపర్ జెయింట్స్, ఎంఐ ఎమిరేట్స్, ఎంఐ న్యూయార్క్, నార్తర్న్ సూపర్ ఛార్జర్స్, రంగ్‌పూర్ రైడర్స్, ట్రిన్‌బాగో నైట్ రైడర్స్‌ జట్లకు పూరన్ ప్రాతినిథ్యం వహించాడు.

Next Story